ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వెర్రీ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది తమ వెర్రీని వివిధ రకాలుగా బయటపెడుతున్నారు. ఆ వెర్రీ నవ్వు తెప్పించే విధంగా ఉంటే అందరికీ మంచిదే కానీ.. ప్రాణాల మీదకు వస్తేనే ప్రమాదం.. ఇక్కడ మనడో చేసిన పని కూడా ఓ రకం వెర్రీలాంటిదే మరీ.. ఎవరైనా చాక్లెట్లు, పిప్పరమెట్లు మింగుతారు.. కానీ, ఇక్కడొక వ్యక్తి ఏకంగా చేతిలో ఉండే సెల్‌ఫోన్‌నే మింగేశాడు. పైగా పొట్టలో సెల్‌ఫోన్ పెట్టుకుని ఏకంగా ఆరునెలలకు పైగానే బిందాస్‌గా బతికేశాడు. ఆఖరికి విపరీతమైన కడుపు నొప్పి రావటంతో చేసేదేం లేక ఆస్పత్రికి పరుగులు పెట్టాడు. ఈ ఘటన ఈజిప్టులో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
సదరు సెల్‌ఫోన్ మింగిన ఘనుడు ఈజిప్టులోని అస్వాన్ యూనివర్సిటీ ఆసుపత్రికి వెళ్లాడు. ఎందుకు కడుపునొప్పి వచ్చిందని డాక్టర్లు అడిగితే.. తెలిసి కూడా కారణం చెప్పలేదు. తనకు తెలియదని, కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు చెప్పాడు. అసలు నొప్పికి కారణం ఏంటని తెలుసుకునేందుకు డాక్టర్లు అతడి పొట్టని స్కాన్ చేయగా.. వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పొట్టలో ఉన్న మొబైల్ ఫోన్ చూసి ఖంగుతిన్నారు. పైగా, అతడు ఆ ఫోన్‌ను మింగేసి ఆరు నెలలైందని చెప్పటంతో మరింత విస్తుపోయారు. ఇది విన్న డాక్టర్లు ఇంత ప్రమాదకరమైన వస్తువును కడుపులో దాచుకుని అబద్ధాలడతావా అని దుమ్ముదులిపారు. కడుపునొప్పి ఎందుకు వస్తుందో తెలియదంటూ అమాయకంగా ముఖం పెట్టిన ఆ రోగిని చెడామడా తిట్టారు.
ఇకపోతే, ఆరునెలల నుంచి ఎందుకు ఆసుపత్రికి రాలేదని అడిగితే… ఆ ఫోన్ సహజపద్దతిలో మూత్రవిసర్జన సమయంలో వచ్చేస్తుందని వెయిట్ చేస్తున్నట్టు చెప్పాడట. కానీ అది రాకపోగా కొన్ని రోజుల నుంచి కడుపునొప్పి మొదలైందని, ఇక భరించలేక వచ్చానని తెలిపాడు. ఆ ఫోన్ వల్ల పెద్దపేగులు, పొట్టలో ఇన్ఫెక్షన్ వచ్చేసింది. దీంతో అతనికి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ ఫోన్ ను పొట్టలోంచి తొలగించారు వైద్యులు. ఈ వార్త కాస్త నెటింట్లో వైరల్‌గా మారటంతో నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. భూమ్మీద ఇలాంటి మేధవులు కూడా ఉంటారా..? అనుకుంటూ ఎద్దేవా చేస్తున్నారు.
Also Read:
కంటైనర్‌ను ఓపెన్ చేసి చూడగా షాక్.. భయంతో ఒక్కసారిగా కళ్లు తేలేసారు.!
పెరుగు బెస్టా.. మజ్జిగ బెటరా.! ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
పెళ్లికాని అబ్బాయిలకు షాక్.. అక్కడి అమ్మాయిలు అలా డిసైడయ్యారట! విస్తుపోయే విషయాలు..