Viral Video: మామిడికాయ కాదు కోడిగుడ్డే.. కాలజ్ఞానంలో బ్రహ్మంగారూ చెప్పని వింత ఇది..!

|

Mar 15, 2022 | 6:33 PM

Viral Video: ఎండాకాలం వచ్చి ఉగాది దగ్గరపడుతుంటే మనకు మొదట గుర్తొచ్చేది మామడి కాయలు, లేలేత మామిడి పూతలు, వేప పూత గుర్తుకోస్తుంది.

Viral Video: మామిడికాయ కాదు కోడిగుడ్డే.. కాలజ్ఞానంలో బ్రహ్మంగారూ చెప్పని వింత ఇది..!
Egg
Follow us on

Viral Video: ఎండాకాలం వచ్చి ఉగాది దగ్గరపడుతుంటే మనకు మొదట గుర్తొచ్చేది మామడి కాయలు, లేలేత మామిడి పూతలు, వేప పూత గుర్తుకోస్తుంది. కొమ్మ కొమ్మకి మామిడి పూతలతో.. మావి చిగురుల చిగురింపులతో కొమ్మకొమ్మకి కోయిల రాగాలతో పకృతి పరవశించి, మామిడిపండ్లు సీజన్ రాకనే రాక వచ్చిందని తెలుస్తూంది. కాని ఒక కోడికి ముందుగానే మామిడి సీజన్ వచ్చిందని తెలిసిందో ఏమో.. రోజూ గుండ్రంగా పెట్టె గుడ్డు కాస్తా.. దాని ఆకారం మార్చుకుని మరీ వెరైటీగా పెట్టింది. అన్ని కొళ్ళు పెట్టే గుడ్ల కన్నా.. నేను పెట్టే గుడ్లు వేరయా.. అంటున్నట్టుగా ఉంది అ గుడ్డును చూస్తే.

సాధారణంగా గుడ్లు గుండ్రంగా.. లేక కోలగా.. లేక చిన్నగా, పెద్దగా ఉంటాయి. కాని ఈ గుడ్డు.. ఒక మాడికాయ రూపంలో ఉంది. అది తెల్ల మామిడి కాయా లేక కోడు గుడ్డు నా అని గుర్తు పట్టలేనంత వింతగా ఉంది ఈ కొడిగుడ్డు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మాదాపురం రోడ్డులో గల బొమ్మిడి సత్తిబాబు అనే వ్యక్తి కిరాణా వ్యాపారి షాపులో ఈ గుడ్డు దర్శనమిచ్చింది. అమ్మకం కోసం కోళ్ళ ఫారాల నుండి వచ్చిన గుడ్లు అట్టల్లో వచ్చినట్లు షాపు యజమాని తెలిపాడు. ఒక మామిడి కాయ, కోడిగుడ్డు రెండు పక్కపక్కనే పెట్టి చూస్తే ఏమాత్రం తేడా లేకుండా పచ్చ మామిడికాయ, తెల్ల మామిడి కాయాల కనిపిస్తుంది. పట్టుకుంటే మాత్రమే ఒక గుడ్డు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ గుడ్డును చూసేందుకు స్ధానికులు పెద్ద షాపు వద్దకు వస్తున్నారు. ఆ గుడ్డును చూసి ఆశ్చర్య పోతున్నారు.

Also read:

Holi 2022 bank holiday: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే!

Telangana Police Jobs: పోలీస్ శిక్షణా కేంద్రాల్లో ట్రైనింగ్ తీసుకోవాలని భావిస్తున్నారా? ఇలా అప్లై చేసుకోండి..!

Holi 2022 – Covid 19: హోళీ పండుగ కోవిడ్ 19 ఫోర్త్ వేవ్‌ను ఆహ్వానిస్తుందా? నిపుణులు ఏం హెచ్చరిస్తున్నారు?