చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని యాన్ నగరంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు. 14 మంది గాయపడ్డారు. పీటీఐ అందించిన సమచారం మేరకు దీని తీవ్రత 6.1గా నమోదైనట్లు తెలుస్తోంది. చైనా భూకంప నెట్‌వర్క్‌ల కేంద్రం లేదా CENC ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు యాన్’న్ సిటీలోని లుషాన్ కౌంటీలో ఈ భూకంపం సంభవించింది. ట్విటర్‌లో షేర్ చేసిన వీడియోలో భూకంపం రావడంతో ఓ మహిళ, చిన్నారి బట్టల దుకాణం నుంచి పరిగెడుతున్నట్లు చూపించారు. మరొక వీడియోలో రహదారిని చూపించారు. భూమి కంపించినప్పుడు రోడ్డుపై వెళ్లే వాహనాలు ఒక్కసారిగా ఆగిపోవడం, వాహనాల్లోంచి దిగి రోడ్డు మధ్యలోకి జనాలు పరుగులు తీయడం, నడుస్తున్నవారు కూడా చెత్తాచెదారం నుంచి తప్పించుకునేందుకు రోడ్డు మధ్యలోకి పరుగులు తీసినట్లు వీడియోలో చూడొచ్చు.
భూకంప కేంద్రం 17 కి.మీ లోతులో ఉందని CENC తెలిపింది. భూకంపం సంభవించిన మూడు నిమిషాల తర్వాత, యాన్’న్ నగరంలోని బాక్సింగ్ కౌంటీలో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. నలుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారని పీపుల్స్ డైలీ పేర్కొంది. భూకంపంలో మరణించిన నలుగురు వ్యక్తులు రాళ్లు మీద పడి చనిపోయారు.
టిబెటన్ పీఠభూమిలోని ప్రావిన్స్‌లో 2008లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ప్రభావితమైన ప్రజల కోసం నిర్మించిన ఇళ్లతో సహా కొండచరియలు విరిగిపడి భవనాలు దెబ్బతిన్నాయని సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు చూపిస్తున్నాయి. భూకంపం సంభవించిన వెంటనే స్కూల్ పిల్లలు తమ తరగతి గదుల నుంచి బయటకు పరుగులు తీశారు. నివాసితులు వీధుల్లోకి పరుగులు తీశారు. తరువాత వరుస ప్రకంపనలు వచ్చాయి.
భూకంపం కారణంగా రెండు కౌంటీల్లోని కొన్ని ప్రాంతాల్లో టెలికాం దెబ్బతింది. అయితే కొన్ని ఆప్టికల్ కేబుల్స్ అత్యవసర మరమ్మతుల తర్వాత పునరుద్ధరించారు. 2008లో, చైనాలో అత్యంత ఘోరమైన భూకంపం సంభవించింది. 7.9-తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం సిచువాన్ ప్రావిన్స్‌లో సంభవించింది. ఇందులో 90,000 మంది మరణించారు.
Visual from CCTV footage of #earthquake 6.8 at #Sichuan #China 4 D!ed and 14 !njured #INDvSA #DeepakChahar #ENGvNZ #CbtfBestHai pic.twitter.com/xseXmOf8hE
— Alindasangma (@alindasangma) June 2, 2022
#Earthquake in China of magnitude 5.9 (6.1 Ms), Sichuan. (06/01/2022) pic.twitter.com/YPxYF3NHlF
— BRAVE SPIRIT (@Brave_spirit81) June 2, 2022