Viral Video: చిరుత మాదిరిగా వేటాడిన గ్రద్ద.. వేట మాములుగా లేదుగా.. వీడియో చూస్తే షాకవుతారు.!

|

Aug 11, 2021 | 9:33 AM

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అవి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. అలాగే..

Viral Video: చిరుత మాదిరిగా వేటాడిన గ్రద్ద.. వేట మాములుగా లేదుగా.. వీడియో చూస్తే షాకవుతారు.!
Eagle
Follow us on

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అవి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. అలాగే అడవిలో జంతువులు చేసే చిత్ర, విచిత్ర విన్యాసాలకు, వేటకు హద్దు ఉండదు. అందుకేనేమో వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో అంత పాపులారిటీని సంపాదిస్తాయి.

పులి, సింహం, చిరుత.. ఇలా క్రూర జంతువులు చేసే వేట మాములుగా ఉండదు. ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటుంది. చక్కటి వ్యూహాన్ని రచించడమే కాకుండా.. ఎరగా దొరికిన జంతువును ఎక్కడా కూడా పారిపోకుండా వేగంగా వేటాడతాయి. ఇదంతా ఒక ఎత్తయితే.. మీరు ఎప్పుడైనా గ్రద్ద వేటను చూశారా.? చిరుత మాదిరిగానే వేటాడుతుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఓ చోట నుంచి మరో చోటకు కొన్ని పక్షులు ఎగురుతూ వెళ్తున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఎక్కడ నుంచి వాటిని చూసిందో తెలియదు గానీ.. గ్రద్ద ఆ గుంపును గమనిస్తుంది. సమయం చూసుకుని వేటకు దిగుతుంది. చిరుత మాదిరిగానే వేగంగా ఎగురుతూ ఓ పక్షిని తన పదునైన కాళ్లతో పట్టుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.!

Also Read:

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!

ఈ ఫోటోలో చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

8 పరుగులకే నాలుగు వికెట్లు.. ఆరుగురు బ్యాట్స్‌మెన్లు ఖాతానే తెరవలేదు.. టీమిండియా వరస్ట్ రికార్డు