Video: వామ్మో.. డ్రైవర్‌ లేకుండానే కదులుతున్న వాహనం! చూస్తే.. ఒళ్లు జలదరించడం ఖాయం!

ముంబైలోని సియాట్ టైర్ల ఫ్యాక్టరీలో డ్రైవర్ లేకుండా నడిచే ఆటోమేటెడ్ వాహనాలను ప్రవేశపెట్టారు. భారీ లోడ్లను మోసే ఈ వాహనాలు రిమోట్ ద్వారా కూడా నియంత్రించబడతాయి. డ్రైవర్ లేకుండా పనిచేసే ఈ సాంకేతికత రవాణా రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకురానుంది. దీని వల్ల సమయం, ఖర్చులు ఆదా అవుతాయి.

Updated on: Apr 18, 2025 | 3:46 PM

డ్రైవర్‌ లేకుండా నడిచే కార్లు వచ్చాయి. కానీ, పెద్ద పెద్ద లోడ్స్‌తో వెళ్లే వాహనాలు అలా డ్రైవర్‌ లేకుండా కదిలితే.. బండి డౌన్‌ సైడ్‌ పార్క్‌ చేసిన హ్యాండ్‌ బ్రేక్‌ వేయడం మర్చిపోయారమో అనుకుంటారు. కానీ, ఇక్కడ డౌన్‌లో పార్క్‌ లేయలేదు. అలాగే ఆ వెహికిల్‌ వెనుక పెద్ద టైర్ల లోడ్‌ ఉంది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు.. బండి ఎటు పడితే అటు పోవడం లేదు. చక్కగా ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లింది. ఈ సీన్లు చూసి.. అక్కడున్న వారికి ఒళ్లు జలదరించింది. ఎందుకంటే.. డ్రైవర్‌ సీటులో డ్రైవర్‌ లేడు, కానీ, స్టీరింగ్‌ మాత్రం తిరుగుతుంది. దెయ్యం ఏమైనా వచ్చి నడుపుతుందా అని చాలా మంది భయపడ్డారు. కానీ, అసలు విషయం ఏంటంటే.. అది డ్రైవర్‌ లేకుండా కూడా ప్రయాణించే ఆటోమేటెడ్‌ వెహికల్‌, రిమోట్‌తో కూడా ఆపరేట్‌ చేయవచ్చు. ముంబైలోని సియట్‌ టైర్ల ఫ్యాక్టరీలో దీన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. డ్రైవర్‌ కూడా దీన్ని నడపవచ్చు, అలాగే డ్రైవర్‌ లేకుండా కూడా పనిచేస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.