Eyeballs: పిచ్చి పీక్స్‌కు వెళ్లింది అంటే ఇదేనేమో. చింపిరి జుట్టు, చిరిగిపోయిన బట్టలు ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది నేటి యువతకు అంతేకాదు, వీటికి తోడు టాటూలనీ ఒళ్లంతా పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు. అయితే, ఒకప్పుడు శరీరంపై మాత్రమే టాటూలు వేయించుకునేవారు. కానీ ఇప్పుడు శరీరంపై ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటున్నారు. గతంలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ముఖం, శరీరంపై అలాగే కళ్ళలో కూడా టాటూలు వేయించుకున్నాడు. పచ్చబొట్టు కారణంగా అతడు పూర్తిగా గ్రహాంతరవాసిలా మారిపోయాడు. ఇక తాజాగా, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన ఓ మోడల్ కూడా తన ఒంటినిండా టాటూలు వేయించుకుని హల్‌చల్ చేస్తోంది.
అంబర్ ల్యూక్ 98శాతం శరీరాన్ని టాటూ చేయించుకుంది. బాడీలో ‘ఇంచు గ్యాప్ లేకుండా.. ఇంక్ చేయించడమే లక్ష్యం’ అంటూ అందులో తనకు ఎన్ని కష్టాలొచ్చినా వెనక్కి తగ్గేదేలేదని తేల్చిచెప్పింది. కళ్లు పోయినా పర్వాలేదు.. ‘ఐ బాల్’కు టాటూ వేయించుకుంటానని పట్టుబట్టిన మోడల్.. ఐదేళ్ల క్రితమే ఆ పని చేసేసింది. డాక్టర్స్ ముందుగా చెప్పినట్లుగానే కొద్ది రోజులు అంధురాలిగా బాధలను ఎదుర్కొంది. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
‘ఐ బాల్స్‌లోకి సిరంజి ఇంజెక్షన్లు ఇవ్వడమనేది టార్చర్ ప్రాసెస్. పది గాజు ముక్కలు పట్టుకుని నా కంటికి రుద్దినట్లు అనిపించింది. బ్లూ కలర్ కన్నీరు రాల్చడం నా ఒక్కదానికే సొంతమైందేమో. అయినా నాకు ఎలాంటి రిగ్రెషన్ లేదు’ అని పేర్కొంది. ఇక ఏడేళ్ల బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో 600 టాటూలు వేయించుకున్న అంబర్.. ఇందుకోసం ఏకంగా రూ.2 కోట్లు వెచ్చించడం విశేషం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి