Viral Video: నిమ్మకాయ తిన్న గాడిదకు ఏం జరిగిందంటే..! ఇదిగో ఆ భయానక దృశ్యం చూస్తే…

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన తర్వాత మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. ఈ వీడియోలో ఒక గాడిదకు నిమ్మకాయ తినిపించారు. అప్పుడా ఆ జంతువు స్పందించిన తీరు చూసిన తర్వాత ఇంటర్నెట్ కూడా షాక్‌ అవుతోంది. గాడిదకు ఏం తెలుసు నిమ్మకాయ వాసన, రుచి అంటూ జనాలు తెగ నవ్వుకుంటున్నారు.

Viral Video: నిమ్మకాయ తిన్న గాడిదకు ఏం జరిగిందంటే..! ఇదిగో ఆ భయానక దృశ్యం చూస్తే...
Donkey Tastes Lemon For First Time

Updated on: Jul 29, 2025 | 8:29 AM

వైరల్ వీడియో ప్రారంభంలో ఒక వ్యక్తి హాయిగా కూర్చుని నిమ్మకాయ తొక్క తీస్తున్నాడు. అతడు నిమ్మకాయ ముక్కను నోటిలో పెట్టుకుని దాని పుల్లదనానికి రకరకాలుగా స్పందిస్తారు. పులుపు కారణంగా అతడి ముఖంలో వింత అనుభవం కనిపిస్తుంది. అంతలోనే ఒక గాడిద అక్కడికి వస్తుంది. ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న నిమ్మకాయ ముక్కను ఆ గాడిద నోటికి అందించి తినిపిస్తాడు. ఇంకేం అది ఏం చక్కా నిమ్మకాయను సాధారణ పండుగా భావించి నమలడం మొదలుపెట్టింది. కానీ, ఆ తరువాత దాని పరిస్థితి అంత మారిపోయింది. ఈ వీడియోను @ccihancelik_ అనే ఖాతా నుండి Instagramలో షేర్ చేశారు.

నోట్లో నిమ్మకాయ పెట్టగానే ఆ గాడిద కూడా సాధారణ పండు, కాయగా భావించి నమలడం ప్రారంభిస్తుంది. కానీ, మరుసటి క్షణం ఆ గాడిద రియాక్షన్‌ మారిపోయింది. నిమ్మకాయ పుల్లదనం గాడిద నాలుకలోకి చేరగానే, అది వెంటనే ఉమ్మివేసింది. అంతటి పులుపు తిన్న ఆ గాడిద ముఖం తీవ్ర భయనకంగా పెట్టింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తమ నవ్వును నియంత్రించుకోలేకపోతున్నారు. చాల మంది నెటిజన్లు ఇది చూశాక కింద పడి నవ్వుకున్నామంటూ కామెంట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ ఫన్నీ వీడియోను ఫిబ్రవరి 13న @ccihancelik_ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే ఈ వీడియోకి 23 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. కామెంట్‌ బాక్స్‌ పూర్తిగా ఫన్నీ కామెంట్స్‌తో నిండిపోయింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..