Viral Video: బెలూన్‌తో వాలీబాల్ ఆడిన శునకాలు.. వీడియో చూస్తే మీరే వావ్ అంటారు..

|

Jan 09, 2022 | 1:27 PM

Dogs playing with balloons: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని

Viral Video: బెలూన్‌తో వాలీబాల్ ఆడిన శునకాలు.. వీడియో చూస్తే మీరే వావ్ అంటారు..
Dogs
Follow us on

Dogs playing with balloons: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. తాజాగా కుక్కలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లంతా నోరెళ్లబెడుతున్నారు. అయితే.. కుక్కలు చాలా తెలివైన జంతువులు. విశ్వాసానికి ప్రతీకగా ఉంటాయి. ఎవరైనా వాటికి హాని తలపెడితే.. అవి హాని తలపెడతాయి. ప్రేమతో మెలిగితే.. అంతే ప్రేమను కనబరుస్తాయి. అందుకోసమే చాలామంది వాటిని పెంచుకుంటుంటారు. అయితే.. కుక్కలతో ఆడుకోవడం చాలా సరదాగా ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలానే చూసి ఉంటారు. అందులో ప్రజలు కుక్కలతో ఆడుకోవడం కనిపిస్తుంది. ఈ రోజుల్లో బాగా వైరల్ అవుతున్న వీడియోలో స్వయంగా కుక్కలే ఆడుకుంటున్నాయి. నిజం.. చాలా కుక్కలు కలిసి బెలూన్‌తో ఆడుకోవడం కనిపిస్తుంది.

వాలీబాల్ ఆడటాన్ని మీరు తప్పక చూసి ఉంటారు. అందులో చాలా మంది ఆటగాళ్ళు ఉంటారు. వారంతా బంతిని కొడుతూ కనిపిస్తారు. అలాగే.. వైరల్ అవుతున్న వీడియోలో అచ్చం ఇలాంటి దృశ్యం కనిపిస్తుంది. అయితే ఇక్కడ కుక్కలు బంతితో కాకుండా బెలూన్‌తో ఆడుతున్నాయి. వాలీబాల్ ప్లేయర్ చేతిలో బంతిని పట్టుకున్నట్లుగా.. ఇక్కడ కుక్కలు దూకుతూ బెలూన్‌ను తలతో కొడుతుంటాయి. కుక్కలు ఆడుకునే చోట అదో పెద్ద మైదానం కానీ.. అక్కడ మనుషులెవరూ లేదు. ఇది చూస్తే కుక్కలే స్వయంగా మ్యాచ్‌ ఆడినట్లు అనిపిస్తుంది.

వైరల్ వీడియో..

Also Read:

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుడిపై కేసు.. అసలేమైందంటే..?

Hemant Soren: సీఎం ఇంట్లో కరోనా కలకలం.. భార్య , పిల్లలు సహా 15 మందికి పాజిటివ్..