విగ్రహమని తెలీక.. నవ్వులు పూయిస్తోన్న కుక్క వీడియో
సాధారణంగా కుక్కలు పెచ్ ఆడుకునేందుకు చాలా ఉత్సాహాన్ని చూపుతుంటాయి. ఇలా ఓ కుక్కకు బాల్ దొరకడంతో ఫెచ్ ఆడటం కోసం ఎవరైనా దొరుకుతారేమో అని చూసింది.
Dog Video goes viral: సాధారణంగా కుక్కలు పెచ్ ఆడుకునేందుకు చాలా ఉత్సాహాన్ని చూపుతుంటాయి. ఇలా ఓ కుక్కకు బాల్ దొరకడంతో ఫెచ్ ఆడటం కోసం ఎవరైనా దొరుకుతారేమో అని చూసింది. దూరంగా ఓ వ్యక్తి కూర్చునట్లు కనిపించడంతో.. ఆ బాల్ తీసుకొని అక్కడికి వెళ్లింది. అతడు బాల్‌ను విసిరేస్తాడేమోనని ఎదురుచూసింది. అయితే అక్కడ ఉన్నది విగ్రహం కావడంతో.. బాల్‌ని విసరలేదు. దీంతో కాసేపు ఎదురుచూసి.. తరువాత అక్కడి నుంచి ఆ కుక్క వెళ్లిపోయింది. ఇక ఈ వీడియో ఐఏఎస్ సుప్రియ సాహు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘హే మీరు ఎందుకు బాల్ ఆడటం లేదు’ అంటూ ఆమె కామెంట్ పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. బాల్ కోసం కుక్క ఆ విగ్రహం వైపు చూసే చూపులు నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తున్నాయి.
Read This Story Also: అంబులెన్స్‌లో కరోనా రోగి మృతి.. డ్రైవర్‌పై దాడి
Hey why are you not playing the ball Man ? ?♥️#dogsoftwitter #statue #dogs pic.twitter.com/SZ7uRdH2El
— Supriya Sahu IAS (@supriyasahuias) July 31, 2020