అమ్మ ప్రేమకు హద్దనేది లేదు.. పరిస్థితులు.. మానస్థత్వాలను బట్టి అమ్మ ప్రేమలో మార్పు రాదు.. తన పిల్లలను ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటుంది తల్లి ప్రేమ.. కేవలం మనుషులు మాత్రమే కాదు..జంతువులలోనూ అమ్మ ప్రేమకు హద్దు ఉండదు.. పిల్లల పట్ల తల్లి చూపించే ప్రేమకు సంబంధించిన వీడియోలను మనం సోషల్ మీడియాలో ఎన్నో చూసి ఉంటాం.. కానీ ఓ తల్లి పులి మాత్రం తన పిల్లలను వదిలిపెట్టేసింది.. పుట్టినప్పటి నుంచి తన పిల్లలను దగ్గరకు రానివ్వకపోవడంతో ఓ శునకం ఆ పులి పిల్లలకు తల్లిగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.
చైనాలోని ఓ జూలో పులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది.. అయితే పుట్టినప్పటి నుంచి ఆ పిల్లలను పులి తన దగ్గరకు రానివ్వలేదు.. దీంతో ఆ పులి పిల్లలు అమ్మ ప్రేమకు దూరమయ్యాయి. అయితే జూ నిర్వాహకులు ఆ మూడు పులి పిల్లల ఆలనా..పాలనను ఓ లాబ్రడార్ కుక్కకు అప్పజెప్పారు. ఆ శునకం మూడు పులి పిల్లలకు తల్లిగా మారిపోయింది.. వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది.. ఎ పీస్ ఆఫ్ నేచర్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఆ శునకం పై ఎక్కి మూడు పులి పిల్లలు ఎంతే ప్రేమగా ఆడుకుంటున్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Because you want to see a lab doggy take care of baby rescue tigers
pic.twitter.com/qmKnyO4Fzi— A Piece of Nature (@apieceofnature) May 15, 2022