Viral News: యజమాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి ..సింహంతో శునకం పోరాటం.. గాయపడి ఆస్పత్రిలో చికిత్స

ఓ పెంపుడు కుక్క తన యజమాని కోసం ప్రాణాలకు తెగించి ఏకంగా అడవికి రాజు సింహంతో పోరాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. శునకం తెగువకు.. యజమాని పట్ల దానికి ఉన్న ప్రేమకు ఫిదా అవుతున్నారు.

Viral News: యజమాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి ..సింహంతో శునకం పోరాటం.. గాయపడి ఆస్పత్రిలో చికిత్స
Dog Viral Post

Updated on: May 22, 2022 | 10:38 AM

Viral News: పెంపుడు జంతువులు తమ యజమానిపట్ల ఎంతటి, విశ్వాసం, ప్రేమాభిమానాలు కలిగి ఉంటాయో అందరికీ తెలిసిందే.  అందులోనూ కుక్క తన యజమాని పట్ల చూపే విశ్వాసం మరీ ప్రత్యేకం. ఓ చిన్న బిస్కెట్ వేసినా చాలు.. వారి పట్ల ఎంతో కృతజ్ఞతను చూపిస్తుంది. తన యజమాని కోసం ఎంతటి సాహసాన్ని అయినా చేస్తుంది. తాజాగా ఓ పెంపుడు కుక్క తన యజమాని కోసం ప్రాణాలకు తెగించి ఏకంగా అడవికి రాజు సింహంతో పోరాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. శునకం తెగువకు.. యజమాని పట్ల దానికి ఉన్న ప్రేమకు ఫిదా అవుతున్నారు.

అమెరికాలో కాలిఫోర్నియాలోని ట్రినిటీ నదికి సమీపంలో ఎరిన్ విల్సన్ అనే మహిళ తన పెంపుడు కుక్కతో ట్రెక్కింగ్‌కి వెళ్లింది. అలా ఆమె పర్వతంపైకి ఎక్కుతున్న క్రమంలో ఒక సింహం ఆమెపై దాడి చేసింది. దాంతో భయపడిన ఆమె తన పెంపుడు కుక్క ఎవాను పిలిచింది. తన యజమాని ప్రమాదంలో ఉందని గ్రహించిన రెండున్నరేళ్ల ఆ శునకం తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఆ మృగరాజుతో వీరోచితంగా పోరాడింది. చివరికి తన యజమానిని రక్షించుకుంది. ఈ పోరాటంలో ఎవా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఎవా ఆస్పుత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషయం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎవా సాహసానికి ఫిదా అయిపోతున్నారు. తన యజమాని కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన ఎవా.. గ్రేట్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us