Viral Video: యజమానికి తెలియకుండా మద్యం తాగిన కుక్క.. మత్తులో ఎన్నో చిన్నెలు.. వీడియో వైరల్

|

Nov 25, 2023 | 9:53 AM

ఈ వీడియో అమెరికాలోని న్యూజెర్సీకి చెందినది. ఇంటి యజమానురాలు మేరీ కొంచెం సమయం బయటకు వెళ్లినప్పుడు ఆమె పెంపుడు కుక్క జాక్..  వోడ్కా బాటిల్ మొత్తాన్ని తాగేసింది. దీని తర్వాత  కుక్క పరిస్థితి ఏమిటనేది వైరల్ అవుతున్న వీడియోలో చూడాల్సిందే. జాక్ పరిస్థితి దిగజారడంతో ఏకంగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందని మేరీ చెప్పింది.

Viral Video: యజమానికి తెలియకుండా మద్యం తాగిన కుక్క.. మత్తులో ఎన్నో చిన్నెలు.. వీడియో వైరల్
Dog Video Viral
Follow us on

మద్యం తాగి మత్తులో ఊగుతూ..  వాగుతూ..  పడుతూ..  లేస్తూ..  రకరకాల విన్యాసాలు చేసే వ్యక్తులను  వ్యక్తులను తరచుగా చూసి ఉంటారు. అయితే మద్యం తాగిన తర్వాత కుక్క కూడా మత్తులో మునిగి రకరకాల విన్యాసాలు చేసిన సంఘటనలు ఎప్పుడైనా చూశారా.. ప్రస్తుతం ఇలాంటి కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దీనిని చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అయిన వీడియో క్లిప్‌లో కుక్క మనుషుల మాదిరిగానే మద్యం మత్తులో ఊగుతూ నడుస్తూ కనిపించింది.

ఈ వీడియో అమెరికాలోని న్యూజెర్సీకి చెందినది. ఇంటి యజమానురాలు మేరీ కొంచెం సమయం బయటకు వెళ్లినప్పుడు ఆమె పెంపుడు కుక్క జాక్..  వోడ్కా బాటిల్ మొత్తాన్ని తాగేసింది. దీని తర్వాత  కుక్క పరిస్థితి ఏమిటనేది వైరల్ అవుతున్న వీడియోలో చూడాల్సిందే. జాక్ పరిస్థితి దిగజారడంతో ఏకంగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందని మేరీ చెప్పింది.

ఇవి కూడా చదవండి

మద్యం తాగి రెచ్చిపోయిన కుక్క

మేరీ ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే జాక్ తాగినట్లు కనిపించిందని చెప్పింది. తర్వాత నేలపై పడి ఉన్న బైలీస్ (మద్యం) ఖాళీ బాటిల్‌ను చూశారు. అదే సమయంలో కౌంటర్లో వోడ్కా బాటిల్ పడిపోయి ఉంది. దీని  మూత సగం తెరిచి ఉంది. మేరీ తన పెంపుడు కుక్కను పిలిస్తే.. మద్యం మత్తులో నడుచుకుంటూ తన యజమానికి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో జాక్ తూలుతూ  నడవ లేక నడవ లేక నడుస్తూ పడుతూ లేస్తూ వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

కుక్కను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది

తాగిన తర్వాత జాక్ పరిస్థితి చూసి మేరీ మొదట నవ్వడం ప్రారంభించింది. అయితే మోతాదు కంటే ఎక్కువగా తాగిన జాక్ పరిస్థితి గురించి ఆమె చాలా ఆందోళన చెందింది. వెంటనే పెట్ పాయిజన్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి పశువైద్యుడికి పూర్తి సమాచారం అందించింది. మేరీ చెప్పిన ప్రకారం జాక్ రాత్రంతా డాక్టర్ సంరక్షణలో ఉంచవలసి వచ్చింది. ఇప్పుడు జాక్ పరిస్థితి మెరుగుపడింది.

నేషనల్ యానిమల్ పాయిజన్ సెంటర్‌ ఇదే విషయంపై మాట్లాడుతూ.. కుక్క ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్, శరీర ఉష్ణోగ్రతలో ప్రమాదకరమైన పడిపోతుందని న్యూస్‌వీక్ పేర్కొంది. అదే సమయంలో తీవ్రంగా మత్తులో ఉన్న జంతువులు కూడా శ్వాసకోశ వైఫల్యం, మూర్ఛలకు గురవుతాయి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..