Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓ వైపు డీజే సాంగ్‌ మోత.. మరోవైపు దుమ్ములేపే డ్యాన్స్‌తో అదరగొట్టిన గ్రామ సింహం.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

Viral Video: జంతువులకు సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు సర్క్యూలేట్ అవుతూనే ఉంటాయి. అవి చేసే అల్లరి చేష్టలు, వింత పనులకు నెటిజన్లు..

Viral Video: ఓ వైపు డీజే సాంగ్‌ మోత.. మరోవైపు దుమ్ములేపే డ్యాన్స్‌తో అదరగొట్టిన గ్రామ సింహం.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
Dog Dance
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 18, 2021 | 7:00 AM

Viral Video: జంతువులకు సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు సర్క్యూలేట్ అవుతూనే ఉంటాయి. అవి చేసే అల్లరి చేష్టలు, వింత పనులకు నెటిజన్లు, జంతు ప్రేమికులు మంత్రముగ్దులైపోతుంటారు. కోతి, పిల్లి, కుక్క వంటి జంతువుల గంతులు, ఆటలు, అల్లరి చేష్టలకు సంబంధించిన వీడియోలు చాలానే చూసుంటాం. ఇంకా శిక్షణ పొందిన జంతువుల సన్నివేశాలను కూడా మనం చూశాం. అయితే, కుక్క డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా?. చూడకపోతే చూసేయండి. తాజాగా ఓ శునకం.. డీజే సాంగ్‌కు డ్యాన్స్ ఇరగదీసింది. ఒక రకమైన శైలితో ఎగురుతూ డ్యాన్స్ కుమ్మేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇంటి బయట కొన్ని కుక్కలు నిల్చుని ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్ వస్తోంది. ఇంతలో ఓ కుక్క సరదాగా డ్యాన్స్ చేస్తూ, గంతెలేస్తూ వస్తోంది. రెండు కాళ్లపై నిలబడి చిందులేస్తూ సందడి చేసింది. దాన్ని చూస్తే.. డ్యాన్స్‌ని, మ్యూజిక్‌ని బాగా ఆస్వాధిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే, డ్యాన్స్ చేస్తున్న కుక్కను పక్కనే ఉన్న మరో కుక్క ఆశ్చర్యపోతూ చూస్తుంది. దాని డ్యాన్స్‌కి ఈ కుక్క కూడా ఫిదా అయిపోయి అలాగే చూస్తుండిపోయింది. ఈ గ్రామసింహం డ్యాన్స్ చేస్తున్న వీడియోను @SeeFunnyVideo Twitter User ‘‘లెట్స్ డ్యాన్స్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. నెటిజన్లు ఈ వీడియోను చూసి ఫిదా అయిపోతున్నారు. కుక్క డ్యాన్స్ నిజంగా సూపర్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. కుక్క ప్రతి స్టెప్ డిస్కో డ్యాన్సర్ మాదిరిగా ఉందని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఇలా నెటిజన్ల నుంచి రకరకాల ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వీడియోను 15 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు.

Viral Video:

Also read:

Old Coin: ఈ 2 రూపాయల నాణెం మీ వద్ద ఉందా? అయితే మీరు లక్షాధికారి అయిపోవచ్చు.. ఎలాగంటే..

Health Benefits: నాన్‌వెజ్ తింటున్నారా? అయితే, ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Indian Railways: రైళ్లలో ఏ లగేజీని తీసుకెళ్లవచ్చు.. ఏ లగేజీని తీసుకెళ్లకూడదో మీకు తెలుసా?.. అయితే తప్పకుండా తెలుసుకోండి..