
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని నిఫాద్ ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వీధి కుక్క, అడవి చిరుతపులి మధ్య భీకర పోరాటం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పోరాటంలో కుక్క చిరుతపులిని అధిగమించింది. అది చిరుతను పట్టుకుని 300 మీటర్లు లాక్కెళ్లింది. ఈ మొత్తం సంఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు.
ఇది కూడా చదవండి: ఐదేళ్ల కిందట బ్యాన్ అయిన టిక్‌టాక్ భారత్‌లోకి మళ్లీ వస్తుందా?
కుక్క చిరుతపులిపై దాడి:
రాత్రి సమయంలో కుక్క చిరుతపులితో ఘర్షణకు దిగుతోందని ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమయంలో చిరుతపులి చాలా భయపడినట్లు కనిపిస్తుంది. అక్కడ నిలబడి ఉన్న కొంతమంది ఈ భయానక క్షణాన్ని తమ కెమెరాలో రికార్డ్ చేస్తున్నారు. కుక్క మొదట చిరుతపులి మెడలో పళ్ళు గుచ్చి, ఆపై దానిని 300 మీటర్ల దూరం లాక్కెళ్లింది. వీడియో వైరల్ అయిన తర్వాత మానవ నివాసాలలో నివసించే కుక్కల సమస్యపై వినియోగదారులలో మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఒక వీధి కుక్క ఇంత ప్రమాదకరమైన జంతువుకు ఇలా చేయగలిగినప్పుడు, అది మనుషులు పెద్ద లెక్క కాదని అంటున్నారు. ఏమైనా ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.
ఇది కూడా చదవండి: Washing Powder Nirma: ఒకప్పుడు దేశాన్ని ఏలిన ‘నిర్మా’ ఇప్పుడు ఏమైపోయింది..? ఒక తప్పు వల్ల కనుమరుగు
ఈ సంఘటన వారం ప్రారంభంలో నిఫాద్ ప్రాంతంలో జరిగింది. ఒక చిరుతపులి పొరపాటున జనవాసాల వైపుకు వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక వీధి కుక్క అకస్మాత్తుగా దానిపైకి దాడికి తెగబడింది. కుక్క దాడి చాలా బలంగా ఉండటంతో పులి భయపడిపోయింది. అది తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ కుక్క దానిని పట్టుకుని చాలా దూరం లాగుతూనే ఉంది. చివరికి, చిరుతపులి ఏదో విధంగా తనను తాను విడిపించుకుని సమీపంలోని పొలాల వైపు పరుగెత్తింది. ఈ పోరాటంలో కుక్క కూడా గాయపడింది.
ये कुत्ते इंसानों के लिए कितने खतरनाक हो सकते हैं ये इन कुत्तों के नाजायज मां बाप डॉग लवर्स को समझाओ कोई… pic.twitter.com/uTTXODS2tN
— आजाद भारत का आजाद नागरिक (@AnathNagrik) August 22, 2025
ఈ వీడియోను సోషల్ మీడియాలో వివిధ ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తున్నారు. దీనిని ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు. అయితే చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు కూడా వీడియోకు కామెంట్లు చేస్తున్నారు. ఈ కుక్కలు ఇకపై మనుషుల మధ్య జీవించడానికి తగినవి కావు అంటూ కామెంట్ చేశాడు మరో నెటిజన్.
ఇది కూడా చదవండి: Gold Price Today: రోజురోజుకు పతనమవుతున్న బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి