Viral: ప్రైవేట్ పార్టులో తీవ్రమైన నొప్పి.. పరుగు పరుగున ఆస్పత్రికి.. డాక్టర్లు టెస్టులు చేయగా
మెడికల్ జర్నల్స్‌లో చిత్రవిచిత్రమైన కేసులను పొందుపరుస్తారు డాక్టర్లు. అలాంటి ఓ చిత్రమైన కేసు గురించి ఇప్పుడు తెలుసుకుందామా. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో గతేడాది జూలైలో చోటు చేసుకుంది. మరి ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.

డాక్టర్లు తమ మెడికల్ కేసులను సాల్వ్ చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తుంటారు. నార్మల్ కేసులు అటుంచితే.. చిత్రవిచిత్రమైన కేసులు మరికొన్ని ఉంటాయి. ఇక అలాంటి వాటిని సాల్వ్ చేయడమే కాదు.. తమ కెరీర్‌లో అరుదైన కేసులు కాబట్టి.. అవి మెడికల్ జర్నల్స్‌లో పొందుపరుస్తారు. ఇప్పుడు చెప్పబోయే ఓ కేసు మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మరి ఆ మెడికల్ కేసు గురించి ఇప్పుడు తెలుసుకుందామా..
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి శరీరంలో నుంచి 16 అంగుళాల పొడవైన విదేశీ వస్తువును డాక్టర్లు తొలగించారు. గతేడాది జూలై 21న ఛతర్‌పూర్ జిల్లా ఆస్పత్రిలో త్రీవమైన కడుపునొప్పితో ఓ రైతు అడ్మిట్ అయ్యాడు. ఆస్పత్రిలోని వైద్యులు అతడికి టెస్టులు చేయగా.. శరీరంలో విదేశీ వస్తువు ఉన్నట్టు కనుగొన్నారు. అది ఎలా శరీరంలోకి చేరిందో తెలియదు గానీ.. దాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. సుమారు రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి.. ఆ విదేశీ వస్తువును తొలగించారు. ఆ విదేశీ వస్తువు వల్ల సదరు రోగికి ఇంటర్నల్‌గా డ్యామేజ్‌స్ చోటు చేసుకున్నాయని డాక్టర్లు తెలిపారు. రోగి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని.. అందుకే ఇలా శరీరంలోకి సొరకాయని చొప్పించి ఉండొచ్చునని అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
