AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆసుపత్రిలో రీల్స్‌ చేస్తూ అడ్డంగా బుక్కైన యువకుడు.. అంతలోనే వచ్చిన డాక్టర్‌ ఏం చేశాడో చూస్తే..

ఆసుపత్రిలో రీల్ చేస్తున్న యువకుడిని మొదట డాక్టర్ మందలించారు. అయితే, రీల్స్ ద్వారా నెలకు 7-8 లక్షలు సంపాదిస్తున్నాడని తెలుసుకున్న తర్వాత డాక్టర్ ఆశ్చర్యపోయి, అతనితో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వైరల్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటూ, సంపాదన విలువను చాటిచెబుతోంది. ఈ ఆకస్మిక ట్విస్ట్‌తో నవ్వులు పూయిస్తూ, డాక్టర్-డ్యాన్సర్ జంట సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

Viral Video: ఆసుపత్రిలో రీల్స్‌ చేస్తూ అడ్డంగా బుక్కైన యువకుడు.. అంతలోనే వచ్చిన డాక్టర్‌ ఏం చేశాడో చూస్తే..
Doctor Dances In Hospital
Jyothi Gadda
|

Updated on: Nov 22, 2025 | 8:00 PM

Share

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఒక ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. ఇది ప్రజలను కడుపుబ్బ నవ్వుకునేలా చేస్తుంది. వైరల్‌ వీడియోలో ఒక యువకుడు ఆసుపత్రి లోపల ఒక పాటకు డ్యాన్స్ చేస్తూ రీల్ షూట్‌ చేస్తూ కనిపించాడు. అతను తన ముందున్న సీటుపై ఫోన్‌ను పెట్టి కెమెరాను ఆన్ చేసి ఉంచాడు. ఎంతో ఉత్సాహంగా రీల్ కోసం డ్యాన్స్‌ చేయడం మొదలుపెట్టాడు. అతను అలా డ్యాన్స్‌ చేయటం మొదలు పెట్టాగనే కొద్దిసేపటికే ఒక డాక్టర్ వస్తాడు.

యువకుడు చేసిన పనికి డాక్టర్‌ అతన్ని మందలించాడు. ఆసుపత్రి ఆవరణలో ఈ విధంగా చిత్రీకరించినందుకు డాక్టర్ అతన్ని మందలించడం వీడియోలో కనిపిస్తుంది. డాక్టర్ కోపాన్ని చూసిన ఆ యువకుడు భయపడి వెంటనే క్షమాపణలు చెప్పాడు. ఆసుపత్రి అంటే చికిత్స కోసం వచ్చే ప్రదేశం. రీల్స్ తయారు చేయడానికి కాదని డాక్టర్ కఠినంగా వివరించాడు. కానీ, ఆ తరువాత అక్కడ సీన్‌ మారిపోయింది. అది చూసిన నెటిజన్లు కూడా షాక్‌ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రిలో రీల్ చేసిన యువకుడు తను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరించాడు. రీల్స్ ద్వారా వచ్చే సంపాదన గురించి విన్న తర్వాత డాక్టర్ మూడ్ మారిపోయింది. కానీ వీడియోలో అత్యంత ఆసక్తికరమైన ట్విస్ట్ ఏమిటంటే, కోపంతో వచ్చిన ఆ డాక్టర్ రీల్స్ తయారు చేయడం ద్వారా ఎంత సంపాదిస్తారని అడిగాడు. ఆ యువకుడు రీల్స్ ద్వారా 7 నుండి 8 లక్షల రూపాయల వరకు సంపాదిస్తానని సమాధానం ఇస్తాడు. ఇది విన్న వెంటనే, డాక్టర్ కోపం హఠాత్తుగా ఆవిరైపోయింది. అతని ప్రవర్తన ఆ క్షణంలోనే మారిపోయింది. ఆ తరువాత ఫ్రేమ్‌లో ఆ యువకుడితో కలిసి డ్యాన్స్ చేస్తూ డాక్టర్ స్వయంగా రీల్‌ను షూట్ చేయటం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా షేర్ అవుతోంది. ఈ స్పెషల్ డాక్టర్-డ్యాన్సర్ జంటను చూసి ప్రజలు చాలా ఆనందిస్తున్నారు. ఒక వినియోగదారు సరదాగా ఇలా వ్రాశాడు, ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి 15 లక్షల రూపాయలు సంపాదిస్తారు. మరొక ఇలా రాశాడు తాను కూడా రీల్ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎవరైనా నాకు డ్యాన్స్ ఎలా చేయాలో నేర్పించగలరు అంటూ రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..