Doctors negligence: డాక్టర్‌ నిర్వాకం… సర్జరీ చేశాడు.. దూది పొట్టలోనే మర్చిపోయాడు.. ఎక్కడంటే..

|

May 15, 2024 | 4:49 PM

ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. ప్రాణాలు కాపాడాల్సిన స్థానంలో ఉండి, ఇలా ప్రవర్తించడమేంటని బాధితుడి బంధువులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు ఆస్పత్రి, వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Doctors negligence: డాక్టర్‌ నిర్వాకం... సర్జరీ చేశాడు.. దూది పొట్టలోనే మర్చిపోయాడు.. ఎక్కడంటే..
Doctors Operate
Follow us on

చాలా మంది డాక్టర్‌ని దేవుడిగా భావిస్తారు. దేవుడు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారని అంటారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మన ప్రాణాలను కాపాడుకోవడానికి వైద్యుల వద్దకు వెళ్తాం. చాలా మంది వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కానీ, కొందరు వైద్యులు మాత్రం తమ వద్దకు వచ్చే రోగుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో రోగులకు అజాగ్రత్తగా వైద్యం చేస్తున్నారు. చాలా ఆసుపత్రుల్లో అనవసర పరీక్షలు, స్కానింగ్ లు చేసి బిల్లులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. శస్త్రచికిత్స చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. అయితే కొందరు వైద్యులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా.. కాటన్, కత్తెర, సర్జరీ వస్తువులను కడుపులో మరచిపోయి కుట్లు వేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది. మీరట్‌కు చెందిన ఓ వ్యక్తి కడుపునొప్పి కారణంగా లోహియానగర్‌లోని ఓ నర్సింగ్‌హోమ్‌కు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు పిత్తాశయం సమస్య ఉందని, శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో.. కొద్దిరోజుల క్రితం డాక్టర్ సర్జరీ చేశారు. ఆపరేషన్ అనంతరం డిశ్చార్జి అయ్యాడు. అయితే ఇంటికి వెళ్లినప్పటి నుంచి రోగి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి భరించలేక మరో ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ డాక్టర్ స్కానింగ్ చేశారు. అప్పుడు కడుపులో పత్తి ఉండటాన్ని వైద్యుడు గమనించాడు. వెంటనే అతనికి ఆపరేషన్ చేసి పత్తిని తొలగించారు.

ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. ప్రాణాలు కాపాడాల్సిన స్థానంలో ఉండి, ఇలా ప్రవర్తించడమేంటని బాధితుడి బంధువులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు ఆస్పత్రి, వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..