Viral Photo: ఎన్నో వింతలకు, మరెన్నో విశేషాలకు ప్రకృతి నెలవు. తనలో ఎన్నో అద్భుతాలను దాచుకుందీ అందమైన ప్రపంచం. కొన్ని ప్రకృతి అద్భుతాలను చూస్తుంటే వీటిని ఇలా ఎవరు రూపొందించారు అన్న అనుమానం కలుగక మానదు. మరికొన్ని సందర్భాల్లో అయితే ఆశ్చర్యపోకుండా ఉండలేం. అయితే ఒకప్పుడు ఇలాంటి ప్రదేశాలను చూడాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ప్రయాణాలు చేసి, వెళ్లాల్సి వచ్చేది. కానీ ఏమంటూ సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చిందే ఇలాంటి ఎన్నో వింతలు అరచేతిలోకి వచ్చేస్తున్నాయి.
ఫోటోలు, వీడియోల రూపంలో మనకు ఎన్నో వింత అనుభూతులను అందిస్తోంది. తాజాగా ఇలాంటి ఓ ప్రకృతి అద్భుతమే నెట్టింట వైరల్ అవుతోంది. చుట్టూ కొండలు, చెట్లు, అడవులు మధ్యలో నుంచి ఓ చిన్న నది పాయలుగా ప్రవహిస్తోంది. ఈ నదీ ప్రవాహాన్ని పై నుంచి చూస్తే అచ్చంగా ఒక డ్రాగన్ రూపాన్ని పోలి ఉంది. దీంతో ఈ ఫోటోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ఇట్టే ప్రపంచాన్ని చుట్టేసిందీ డ్రాగన్ రివర్. అన్నట్లు ఈ నదిని.. ‘బ్లూ డ్రాగన్ రివర్’ అని పిలవడం మరో విశేషం.
When river look like a dragon…
From Portugal.
?Faces in Things pic.twitter.com/0NWYPsXLQZ— Susanta Nanda IFS (@susantananda3) November 27, 2021
ఇంతకీ ఈ నది ఎక్కడుందనేగా మీ సందేహం. పోర్చుగల్ దేశంలోని అల్గ్రేవ్ అనే ప్రాంతంలో ఈ అద్భుతమైన నది ఉంది. ఆ ప్రాంతానికి చెందిన వారు విమానంలో వెళుతున్న సమయంలో తీసిన ఫోటోనే ఇది. నిజానికి ఈ నది అసలు పేరు ఒడెలైట్. కానీ డ్రాగన్ ఆకారంలో ఉండడంతో బ్లూ డ్రాగన్ రివర్‌గా కూడా పిలుస్తున్నారు.
Also Read: Viral Video: ఇంత క్యూట్ కచ్చ బాదం డ్యాన్స్‌ను మీరెప్పుడు చూసి ఉండరు.. వైరల్ అవుతోన్న వీడియో..
NAARM Recruitment 2022: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.. ఎన్ఏఏఆర్ఎమ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు!
Skin Diseases: చర్మంపై ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే ప్రమాదం పొంచి ఉన్నట్లే..