AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోతులకు మరణం ముందుగానే తెలుస్తుందా..? అడవిలో వాటి మృతదేహాలు ఎందుకు కనిపించవు? ఆ రహస్యాలివే!

అడవుల్లో కోతులు చనిపోయినప్పుడు వాటి మృతదేహాలు సాధారణంగా మనకు కనిపంచకపోవడం ఒక పెద్ద ప్రకృతి వింత. మరణం వస్తుందనే ముందస్తు సూచన, ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోవడం, ఆంజనేయుడిపై ఉన్న పౌరాణిక నమ్మకం, ప్రకృతి స్వీయ-శుభ్రపరిచే వ్యవస్థ వంటివి ఈ అద్భుతం వెనుక ఉన్న కారణాలు. వాటిలో కొన్ని శాస్త్రీయంగా నిరూపించబడినవి కాగా, మరికొన్ని మతపరమైన నమ్మకాలు. విజ్ఞానశాస్త్రానికి అతీతమైన ఒక సృష్టి తత్వం కూడా ఇందులో ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

కోతులకు మరణం ముందుగానే తెలుస్తుందా..? అడవిలో వాటి మృతదేహాలు ఎందుకు కనిపించవు? ఆ రహస్యాలివే!
Monkey Death BehaviorImage Credit source: AI image
Jyothi Gadda
|

Updated on: Sep 09, 2026 | 3:20 PM

Share

ప్రకృతిలో ప్రతి జీవి జననం, మరణం వెనుక అనేక ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా జంతు ప్రపంచంలో కోతుల ప్రవర్తన మనుషులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. అడవుల్లో ఎన్నో కోతులు నివసిస్తుంటాయి. కానీ, వాటి సహజ మరణం సంభవించినప్పుడు కళేబరాలు లేదా మృతదేహాలు మనకు సాధారణంగా ఎక్కడా కనిపించవు. అసలు కోతులు చనిపోయేముందు ఏం చేస్తాయి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ, పౌరాణిక కారణాలేంటో చూద్దాం.

మరణాన్ని ముందే గ్రహించి ఏకాంతవాసం:

విశ్వాసాలు, కొన్ని పరిశీలనల ప్రకారం.. కోతులు తమ మరణ సమయాన్ని కొన్ని రోజుల ముందే ఊహిస్తాయి. చావు దగ్గరపడిందని తెలిసిన వెంటనే అవి తమ గుంపును వదిలి అడవిలోని అత్యంత లోపలి భాగానికి, నిర్మానుష్య ప్రదేశానికి లేదా పుట్టల వద్దకు వెళ్లిపోతాయి. అక్కడ ఎలాంటి ఆహారం, నీళ్లు తీసుకోకుండా ప్రశాంతంగా, ధ్యానంలాగా మౌనంగా ఉండి ప్రాణాలు వదులుతాయి. చనిపోయిన తర్వాత చెదలు వాటి శరీరాన్ని ఆవహించి మట్టిలో కలిపేస్తాయి.

పౌరాణిక నమ్మకం – శ్రీరాముడి వరం:

రామాయణంలో ఆంజనేయ స్వామి శ్రీరాముడిని ఒక వరం కోరినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. తన మరణం ఎవరికీ ఇబ్బంది కలగకూడదని, తన శరీరం ఇతరులకు కనిపించకుండా చెదలకు ఆహారంగా మారిపోవాలి అని కోరారట. కోతులను ఆంజనేయాంశగా భావిస్తారు కాబట్టి, ఆ వరం వల్లే కోతుల మృతదేహాలు మనుషులకు కంటపడవని భక్తుల నమ్మకం.

ఇవి కూడా చదవండి

శాస్త్రీయ విశ్లేషణ – ప్రకృతి స్వయం శుభ్రత ప్రక్రియ:

విజ్ఞాన శాస్త్రం ప్రకారం, ఇది ప్రకృతిలోని నేచురల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలో భాగం. కోతి చనిపోయిన వెంటనే అడవిలోని నక్కలు, చిరుతలు, గద్దలు, కాకులు వాటిని ఆహారంగా తీసుకుంటాయి. కొన్ని గంటల్లోనే వేలాది పురుగులు, బ్యాక్టీరియా కళేబరాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. మాంసం నశించిన తర్వాత మిగిలిన ఎముకలను ముళ్లపందుల వంటి జంతువులు తమ క్యాన్షియం అవసరాల కోసం నమిలి తినేస్తాయి. ఈ విధంగా సైన్స్, పౌరాణిక విశ్వాసాలు రెండూ కోతుల మరణం వెనుక ఉన్న అద్భుతమైన రహస్యాలను వెల్లడిస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇంటర్ అర్హతతో 2,536 ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92 వేల వరకు జీతం!
ఇంటర్ అర్హతతో 2,536 ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92 వేల వరకు జీతం!
చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి...
చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి...
రాత్రిపూట ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నారా?
రాత్రిపూట ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నారా?
భారీగా ఖర్చు చేసి ఫుడ్ వీడియోలు.. యూట్యూబర్లకు ఆ రేంజ్‌ ఆదాయం..
భారీగా ఖర్చు చేసి ఫుడ్ వీడియోలు.. యూట్యూబర్లకు ఆ రేంజ్‌ ఆదాయం..
కోతులకు మరణం ముందుగానే తెలుస్తుందా? పరిశోధనలో ఆసక్తికర విషయాలు!
కోతులకు మరణం ముందుగానే తెలుస్తుందా? పరిశోధనలో ఆసక్తికర విషయాలు!
CTET పరీక్ష వాయిదా.. డిసెంబర్‌లోనే నిర్వహిస్తారా? సవరణలకు రేపటి..
CTET పరీక్ష వాయిదా.. డిసెంబర్‌లోనే నిర్వహిస్తారా? సవరణలకు రేపటి..
నాకేం తెలియదు.. చేసిందంతా ఆయనే.. పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన
నాకేం తెలియదు.. చేసిందంతా ఆయనే.. పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన
కూలిన వంతెన.. పొలాన్నే రోడ్డుగా మార్చి టోల్ వసూలు చేస్తున్న రైతు!
కూలిన వంతెన.. పొలాన్నే రోడ్డుగా మార్చి టోల్ వసూలు చేస్తున్న రైతు!
తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు ఇన్సూరెన్స్
తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు ఇన్సూరెన్స్
8 నెలలుగా ఓటీటీలో ట్రెండింగ్.. సంచలనంగా మారిన సిరీస్..
8 నెలలుగా ఓటీటీలో ట్రెండింగ్.. సంచలనంగా మారిన సిరీస్..