Watch: ఓరీ దేవుడో.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ కోసం డేంజరస్‌ స్టంట్‌..! ఏం చేశాడో చూస్తే మీ ఫ్యూజులు అవుట్..

సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి ఏమి చేస్తారు..? మొబైల్ ఛార్జర్‌ను పవర్ సాకెట్‌కు కనెక్ట్ చేసి, దానికి ఫోన్‌ను అటాచ్ చేస్తారు.. కానీ సెల్‌ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఒక కొత్త మార్గం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి ఇంటర్నెట్ ప్రజలు షాక్ అవుతున్నారు. ఇలాంటి జుగాఢ్ ఎప్పుడూ చూడలేదంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేం టెక్నిక్‌రా బాబు అంటూ మండిపడుతున్నారు.. వీడియో మాత్రం వేగంగా వైరల్‌ అవుతోంది.

Watch: ఓరీ దేవుడో.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ కోసం డేంజరస్‌ స్టంట్‌..! ఏం చేశాడో చూస్తే మీ ఫ్యూజులు అవుట్..
Shocking Hack For Charging

Updated on: Mar 07, 2025 | 9:36 AM

నేటి ఆధునిక కాలంలో మొబైల్ మనందరి ‘బెస్ట్ ఫ్రెండ్’ గా మారింది. అది లేకుండా మనం ఒక్క క్షణం కూడా గడపలేము. ఈ ‘బెస్ట్ ఫ్రెండ్’ ని చేతుల్లో పట్టుకుని మనం గంటల తరబడి స్క్రోల్ చేస్తుంటారు. అది అనుకోకుండా మన నుండి జారిపోయినప్పుడు లేదా నేలపై పడినప్పుడు మనలో టెన్షన్‌ మామూలుగా ఉండదు..ఒక్కసారిగా గుండె దడదడలాడుతుంది. మొత్తం మీద ఫోన్ అనేది ఒక వ్యసనంగా మారిపోయింది. దానికి దూరంగా ఉండాలనే ఆలోచన కూడా ప్రజలకు ఒక భయం లాంటిది. మీరు ‘నోమోఫోబియా’ గురించి వినే ఉంటారు. అలాంటిదే ఫోన్‌ ఫోబియా కూడా అంటున్నారు విశ్లేషకులు.

ఇక, చేతిలోని మొబైల్‌ఫోన్‌ సిగ్నల్‌ లేకపోయినా, ఛార్జింగ్‌ లేకపోయినా ఆందోళన తప్పదు. అందుకే ప్రజలు తమ ఫోన్‌లను ఎప్పటికప్పుడు పూర్తిగా ఛార్జ్‌ చేసుకుని పెట్టుకుంటారు. ఇప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లోని కొంతమంది తమ ఫోన్‌లను ఛార్జ్ చేసుకోవడానికి కొన్ని జుగాడ్ ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఒక భయంకరమైన జుగాద్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. చాలా డేంజరస్‌ స్టంట్‌ అంటున్నారు నెటిజన్లు. వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ వీడియోలో ఒక వ్యక్తి విద్యుత్ తీగను కత్తిరించి మొబైల్ ఛార్జర్‌ పిన్స్‌కి కనెక్ట్‌ చేశాడు. ఆ వైర్‌ రెండో సైడ్ గ్రామంలోని మెయిన్‌ కరెంట్‌ సప్లై చేసే విద్యుత్ వైర్లకు కర్ర సాయంతో తగిలించాడు.. పూర్వం కరెంట్‌ సౌకర్యం సరిగా లేని గ్రామాల్లో ఇలాగే వైర్‌ తగిలించి ఇంట్లో లైట్లు వెలిగించే వారు.. అచ్చం అదే టెక్నిక్‌ ఉపయోగించి ఇక్కడ ఒక వ్యక్తి మొబైల్‌ ఛార్జింగ్‌ చేస్తున్నాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. భారతదేశ ప్రజలు చాలా ప్రమాదకరమని, వారు ఏం చేస్తారో కూడా ఎవరూ ఊహించలేరని అంటున్నారు. ఆ మనిషి కళాత్మకతను చూసిన కొందరు అతన్ని ప్రశంసిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై చాలా మంది వినియోగదారులు స్పందించారు. ఈ వీడియో ‘krishna_das___123’ అనే ఖాతా నుండి షేర్ చేయబడింది. ఈ వార్త రాసే సమయానికి 17.5 మిలియన్ (సుమారు 2 కోట్లు) కు పైగా వ్యూస్‌, 5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అలాగే, మూడు వేలకు పైగా వినియోగదారులు దీనిపై కామెంట్లు చేశారు. హే బ్రదర్, ఈ వీడియోను తొలగించు, ఈ జుగాద్ భారతదేశం నుండి బయటకు వెళ్లకూడదు అని ఒకరు రాశారు. ఇలాంటి గొప్ప వ్యక్తికి ప్రత్యేక అవార్డు ఇవ్వాలి అంటూ మరొకరు రాశారు. ఇలా చాలా మంది చాలా రకాలుగా తమ అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..