Viral Video: అందరికీ భిన్నం ఈ పెళ్లి కూతురు.. స్వయంగా స్కూటీ నడుపుతూ.. పెళ్లి వేదిక వద్దకు.. వీడియో వైరల్

|

May 25, 2022 | 9:44 AM

ప్రస్తుతం పెళ్లికూతురు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పెళ్లికి ముందు వధువు స్కూటీతో ఒంటరిగా బయలుదేరింది. తాను స్కూటర్ డ్రైవ్ చేస్తూ.. మరోవైపు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ.. ఒక బాలీవుడ్ పాటకు లిప్ సింక్ కూడా చేసింది.

Viral Video: అందరికీ భిన్నం ఈ పెళ్లి కూతురు.. స్వయంగా స్కూటీ నడుపుతూ.. పెళ్లి వేదిక వద్దకు.. వీడియో వైరల్
Viral Video
Follow us on

Viral Video: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ .. దీంతో సోషల్ మీడియాలో పెళ్లి వేడుకక్కి సంబంధించిన వీడియోలు  చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోల్లో కొన్ని చాలా ఫన్నీగా ఉండి.. నవ్విస్తున్నాయి. అలాంటి వీడియోలను మళ్ళీ మళ్లీ చూడాలనుకుంటున్నారు. మరికొన్ని వీడియోలు కళ్లలో నీరు వచ్చేంత భావోద్వేగంగా ఉత్నయి. అదే సమయంలో  కొన్ని వీడియోల్లో వధువు తనదైన శైలితో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. ప్రస్తుతం అలాంటి పెళ్లికూతురు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పెళ్లికి ముందు వధువు స్కూటీతో ఒంటరిగా బయలుదేరింది. తాను స్కూటర్ డ్రైవ్ చేస్తూ.. మరోవైపు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ.. ఒక బాలీవుడ్ పాటకు లిప్ సింక్ కూడా చేసింది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను దోచుకుంది.

సాధారణంగా వధువు పెళ్లి పందిరిలోకి అడుగు పెట్టె సమయంలో ఎంతో ఒద్దికగా.. తన సోదరులు, స్నేహితులతో కలిసి సిగ్గుతో మోముని కిందకు దింపి సంప్రదాయంగా ఎంట్రీ ఇస్తుంది. అయితే ఈ పెళ్లి కూతురు మాత్రం కాస్త డిఫరెంట్. ఈ వధువు తన పెళ్లికి ముందు స్కూటీతో హాయిగా ఎక్కడికో వెళుతుంది. వైరల్ అవుతున్న వీడియోలో, పెళ్లికి పూర్తిగా సిద్ధమైన వధువు స్కూటీని నడుపుతున్నట్లు మీరు చూడవచ్చు. ఈ సమయంలో, ఆమె.. పెళ్లి మండపం నుంచి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటూ సన్నివేశానికి సరిపోయే సాంగ్ వినిపిస్తోంది. ‘షాదీ కే మండప్ సే తు ఖుద్ కో భగా…’ అనే బాలీవుడ్ పాటకు పెదవి సింక్ చేస్తోంది.  ఆ యువతికి పెళ్లికి ముందు లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. వధువు లెహంగాలో చాలా అందంగా ఉంది. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు.

ఇవి కూడా చదవండి

వీడియోపై ఓ లుక్ వేయండి: 

 

ఈ అందమైన వీడియో bridal_lehenga_design అనే పేజీలో Instagramలో షేర్ చేశారు. ఇప్పుడు మీరు ఏమి అర్థం చేసుకున్నారు అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. పారిపోతున్న వధువు అనే వీడియో క్యాప్షన్‌లో వ్రాయబడింది. సోషల్ మీడియా జనాలు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. వధువు తన విభిన్నమైన, స్టైలిష్ స్టైల్‌తో అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ పెళ్లికూతురు వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్నిట్రెండింగ్  వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..