సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు వింత చేష్టలకు దిగుతున్నారు. రోడ్డుపై వాహనం నడుపుతుండగా కారుపై పుషప్‌లు చేయడం, డోర్‌కు వేలాడుతూ నిలబడటం, బైక్‌పై వెళ్తూ అసభ్యకర పనులు చేయడం సోషల్‌మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇటీవల మెట్రో రైలులో యువకులు చేసిన చర్య.. మెట్రో సిబ్బందికి ఆగ్రహం తెప్పించింది. దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్ నగరాల్లో మెట్రో రైళ్ల వినియోగం పెరుగుతోంది. అందుకు అనుగుణంగా సాంకేతికత సాయంతో మెట్రో రైళ్లలో ప్రజల భద్రత కోసం ఆటోమేటిక్ డోర్లను అమర్చారు. ట్రైన్ స్టేషన్‌కు వచ్చిన తర్వాత మాత్రమే ఈ తలుపులు తెరుచుకుంటాయి. అనంతరం అన్ని డోర్లు మూసివేసిన తర్వాత మాత్రమే మెట్రో రైలు బయలుదేరుతుంది.
ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువకుడు ట్రైన్ డోర్‌ను కాళ్లతో అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవనాలు, కాంప్లెక్స్‌లతో లిఫ్ట్ మాదిరిగానే ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ మెట్రో ట్రైన్‌లోనూ ఉంటుంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదు చేయడానికి మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రకటించింది.
Ase logo ki wajhse metro (@OfficialDMRC) late hoti hai? pic.twitter.com/l7nopyU6UK
— Aman (@imb0yaman) June 8, 2023
అయితే ఈ టెక్నాలజీ చాలా మంది మెట్రో రైలు ప్రయాణికులకు సుపరిచితమే. ఈ క్రమంలో ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు ఆకతాయి యువకులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. ట్రైన్ కదిలేముందు డోర్లు మూసుకుంటుండగా.. అవి క్లోజ్ అవ్వకుండా కాళ్లతో అడ్డుకుంటున్నారు. ఈ సంఘటనను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెట్రో రైళ్లలో ఆటోమేటిక్ డోర్ల మధ్యలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే వెంటనే తెరుచుకుంటాయి.
చదువుకున్న నిరక్షరాస్యులని ఒకరంటే.. రూ.50వేలు జరిమానా విధిస్తేనే బాగుపడతారని మరికొందరు అంటున్నారు. అసలు ఈ ఆకతాయి కుర్రాళ్లను మూడు రోజుల పాటు పబ్లిక్ టాయిలెట్‌లో బంధించాలని మరొకరు వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..