వామ్మో..మూడో అంతస్తు నుంచి కిందపడ్డ బుడ్డొడు..!?

|

Dec 04, 2019 | 6:09 PM

డామన్‌ డయ్యూలో ఒళ్లు గగ్గుర్పొడిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే అది నిజంగా వండర్‌ అనే చెప్పాలి. ఎందుకంటే, జరిగిన ఘటనలో దృశ్యాలు చూసినవారందరూ నివ్వేరపోయి చూస్తున్నారు. అది డిసెంబర్‌ 3వ తేదీ, రాత్రి సమయం..ఉన్నట్టుండి ఆకాశంలోంచి చిన్నపిల్లాడి ఏడుపు శబ్ధాలు వినిపించాయి అక్కడి స్థానికులకు. కానీ, ఎవరు చేస్తున్నారు..ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థంకాక అంతా అయోమయంగా చూశారు. అంతలోనే ఎదురుగా ఉన్న ఓ ఎత్తైన భవనం మూడో అంతస్తు గోడ చివరి అంచున […]

వామ్మో..మూడో అంతస్తు నుంచి కిందపడ్డ బుడ్డొడు..!?
Follow us on

డామన్‌ డయ్యూలో ఒళ్లు గగ్గుర్పొడిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే అది నిజంగా వండర్‌ అనే చెప్పాలి. ఎందుకంటే, జరిగిన ఘటనలో దృశ్యాలు చూసినవారందరూ నివ్వేరపోయి చూస్తున్నారు. అది డిసెంబర్‌ 3వ తేదీ, రాత్రి సమయం..ఉన్నట్టుండి ఆకాశంలోంచి చిన్నపిల్లాడి ఏడుపు శబ్ధాలు వినిపించాయి అక్కడి స్థానికులకు. కానీ, ఎవరు చేస్తున్నారు..ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థంకాక అంతా అయోమయంగా చూశారు.

అంతలోనే ఎదురుగా ఉన్న ఓ ఎత్తైన భవనం మూడో అంతస్తు గోడ చివరి అంచున నిలబడి కనిపించాడు రెండేళ్ల బాలుడు. పాపం అక్కడికి ఎలా వెళ్లాడో తెలియదు..కానీ, భయంతో ఏడ్చాడు. అప్పుడే అక్కడ వెళుతున్న వారికి ఏడుపు శబ్దాలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులంతా ఒక్కచోట చేరారు. చేతులు పైకెత్తి వలలాగా ఏర్పాటయ్యారు. అంతలోనే బుడ్డొడు జారిపడటంతో సురక్షితంగా పట్టుకున్నారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాబును కాపాడిన వారిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఆ బాలుడు “మృత్యుంజయుడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీరు ఓ సారి ఆ వీడియోను చూసేయండి..