తాళికట్టు శుభవేళ పెళ్లి కొడుకు నిరసన..తెలిస్తే మీరూ లైక్‌ చేస్తారు..!

తాళికట్టు శుభవేళ పెళ్లి కొడుకు నిరసన..తెలిస్తే మీరూ లైక్‌ చేస్తారు..!

ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో ఓ పెళ్లి వేడుకలో ఉన్నట్టుండి గందరగోళం నెలకొంది. పెళ్లికి వచ్చిన వారంతా అక్కడ ఏం జరుగుతుందో తెలియక ముక్కున వేలేసుకున్నారు. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఇరు కుటుంబాల పెద్దలు. పెళ్లి భోజనాలతో పాటుగా ..పెళ్లి పీటలపై నవ వధువు రెడీగా ఉంది. బంధువులంతా విచ్చేశారు. ఇక పెళ్లికొడుకు అమ్మాయి మెడలో మూడుముళ్లు వేయటమే తరువాయి. కానీ, అంతలోనే..ఆ పెళ్లికొడుకు నిరసన దీక్షలో కూర్చున్నాడు. అయితే, అది కట్నకానుకల కోసం కాదు. అమ్మాయి […]

Pardhasaradhi Peri

| Edited By: Srinu Perla

Dec 04, 2019 | 5:21 PM

ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో ఓ పెళ్లి వేడుకలో ఉన్నట్టుండి గందరగోళం నెలకొంది. పెళ్లికి వచ్చిన వారంతా అక్కడ ఏం జరుగుతుందో తెలియక ముక్కున వేలేసుకున్నారు. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఇరు కుటుంబాల పెద్దలు. పెళ్లి భోజనాలతో పాటుగా ..పెళ్లి పీటలపై నవ వధువు రెడీగా ఉంది. బంధువులంతా విచ్చేశారు. ఇక పెళ్లికొడుకు అమ్మాయి మెడలో మూడుముళ్లు వేయటమే తరువాయి. కానీ, అంతలోనే..ఆ పెళ్లికొడుకు నిరసన దీక్షలో కూర్చున్నాడు. అయితే, అది కట్నకానుకల కోసం కాదు. అమ్మాయి నచ్చక అసలే కాదట. అక్కడి స్థానికులు చేస్తున్న ఓ డిమాండ్‌కు పెళ్లి కొడుకు నేను సైతం అన్నాడట. వివరాల్లోకి వెళితే..
పెళ్లి తంతు జరుగుతున్న ప్రాంతం మహోబాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం స్థానిక యువకులు కొన్ని రోజులుగా ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే డిసెంబర్ 1న పెళ్లి చేసుకోవడానికి మహోబాకు ఊరేగింపుగా వచ్చిన పెళ్లి కొడుకు వారు చేస్తున్న ధర్నాపై ఆరా తీశాడు. స్థానికులు చెప్పిన సమాధానానికి ఆకర్షితుడైన సదరు పెళ్లి కొడుకు.. నిరసనకారులకు మద్దతుగా దీక్షలో కూర్చున్నాడు. పెళ్లికుమారుడి అలంకరణలో దీక్షలో కూర్చున్న అతడి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. వరుడు చేసిన దీక్షకు నెటిజన్లు సైతం సోషల్‌ మీడియా వేదికగా  అభిమానం కుమ్మరిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu