Trending: పెంపుడు కుక్క విశ్వాసం.. యజమాని కడుపు నింపడం కోసం రోజుకు 2 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ..

|

Jun 01, 2022 | 7:54 AM

కుక్కలంటేనే విశ్వాసానికి ప్రతిరూపం. యజమాని కనపడితే చాలు తోక ఊపుతూ తెగ సంబరపడిపోయే నిస్వార్థ మూగజీవి. ఆపదల నుంచి తమ యజమానులను రక్షించేందుకు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి. అందుకే..

Trending: పెంపుడు కుక్క విశ్వాసం.. యజమాని కడుపు నింపడం కోసం రోజుకు 2 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ..
Cute Dog
Follow us on

కుక్కలంటేనే విశ్వాసానికి ప్రతిరూపం. యజమాని కనపడితే చాలు తోక ఊపుతూ తెగ సంబరపడిపోయే నిస్వార్థ మూగజీవి. ఆపదల నుంచి తమ యజమానులను రక్షించేందుకు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి. అందుకే.. మనిషికి బెస్ట్ ఫ్రెండ్ శునకమే అంటారు. పెంపుడు కుక్కలు తమ యజమానిపట్ల ఎంతటి, విశ్వాసం, ప్రేమాభిమానాలు కలిగి ఉంటాయో మరోసారి రుజువైంది. ఓ పెంపుడు కుక్క తన యజమాని కోసం ప్రతిరోజూ రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి..లంచ్‌ బాక్స్‌ అందిస్తోంది. ఈ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట చేరి అందరినీ ఆకర్షిస్తున్నాయి.

వీడియోలో…ఓ అందమైన జర్మన్ షెపర్డ్ కుక్క తన యజమాని కోసం లంచ్ బాక్స్‌ తీసుకెల్తోంది. ఇంటి నుంచి ఆఫీస్‌కి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. టిఫిన్‌ బాక్స్‌ నోట కరచుకుని రోడ్డుపై వేగంగా నడుస్తూ..తన యజమాని కార్యాలయానికి జాగ్రత్తగా మోసుకెళ్తుంది. అక్కడ అతడి భోజనం ముగిసిన తరువాత తిరిగి ఖాళీ బాక్స్‌తో ఇంటికి చేరుతుంది. ఇదంతా ప్రతినిత్యం ఆ పెంపుడు శునకం దినచర్యగా మారింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయబడిన ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. ఒక జర్మన్ షెపర్డ్ కుక్క తన యాజమాని కోసం ప్రతిరోజూ 2 కిలోమీటర్లు నడిచి అతనికి ఎలా భోజనం తీసుకెళ్తుందో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కుక్క నోటితో లంచ్‌ బాక్స్‌ మోస్తున్న సీన్‌ నెటిజన్లను కట్టిపడేస్తుంది. ఆ పెంపుడు కుక్క బాక్స్‌ బరువును భరిస్తూ..అంతదూరం నడిచి వెళ్లటం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో షేర్ చేసిన యూజర్‌ దానికి ఇలాంటి క్యాప్షన్‌ ఇచ్చారు.. “ఇది చాలా అందమైనది కాదా?” అంటూ రాసుకొచ్చారు. ఇక వీడియో చూసిన నెటిజన్లు ఈ కుక్కకు బాగా ట్రైనింగ్‌ ఇచ్చారు. రోడ్డుపై ట్రాఫిక్‌లో జాగ్రత్తగా వెల్లగలిగింది అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు.