కూటి కోసం కోటి తిప్పలు అని ఊరికే అనలేదు. అకలి, దప్పిక తీర్చుకోవడానికి భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి..ఇక ఆహారం కనిపిస్తే.. అందుకోవడానికి చేసే ప్రయత్నాలు అనేకం. ఆకలి బాధలను తగ్గించుకోవడానికి మనుషుల నుంచి జంతువులు, పక్షుల వరకు అన్నింటి పాత్ర ఒక్కటే. చేసే ప్రయత్నాలే వేరుగా ఉంటాయి. అయితే మనుషుల మాదిరిగానే జంతువులకు, పక్షులకు తెలివి.. ఆలోచనలు ఉంటాయనేది కొన్ని సందర్బాల్లో తెలుస్తుంటుంది. అచ్చం మనుషుల మాదిరిగానే పక్షులు కూడా స్పందిస్తుంటాయి. తాజాగా ఓ కాకి..తన ఆకలి తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నం నెటిజన్లకు ఆకట్టుకోవడమే కాకుండా.. ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
ఆ వీడియోలో.. కింద పడి ఉన్న గ్లాసులో ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి కాకి నానా రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఒక సన్నటి కర్ర పుల్లని తీసుకువచ్చి… దానితో ఆహారాన్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తుంది. అలా అనేక సార్లు ప్రయత్నించి.. చివరకు ఆహారం కాస్త బయటకు రాగానే నోటితో అందుకుని ఆకలి తీర్చుకుంది. ఇందులో కాకి.. నిజాంగానే మనుషుల మాదిరిగానే ఆ కర్రను స్ట్రాగా మార్చి ఆహారాన్ని అందుకోవడం చూస్తుంటే.. ఆశ్చర్యం కలగకమానదు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. కాకి తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇన్స్టా పోస్ట్..
Siri Hanmanth: బిగ్ బాస్ హౌస్‌లో సిరి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్