Crocodile Roaming On Village
Crocodile Roaming on Village: సాధారణంగా మొసళ్లు నీటిలో, లేకపోతే నీటి పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. అయితే.. కర్ణాటకలోని ఓ గ్రామానికి మొసలి విహారయాత్రకు వచ్చింది. అదేనండి.. గ్రామంలోకి దర్జాగా ప్రవేశించి ఊరు మొత్తం కలియతిరిగింది. భారీ మొసలిని చూసిన గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. పర్యాటక ప్రాంతమైన ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలి కోగిలబానా గ్రామంలోకి గురువారం ఉదయం భారీ మొసలి ప్రవేశించింది. భారీ మొసలిని చూసిన గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు. వీధుల్లో మొసలి తీరుగుతున్న సమాచారాన్ని వెంటనే అటవీ అధికారులకు చేరవేశారు. ఆ తర్వాత వారొచ్చి మొసలిని సురక్షితంగా పట్టుకొని నీటిలో వదిలిపెట్టారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.