నీటిలో మొసలికి అస్సలు తిరుగుండదు. అందుకే దీన్ని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తుంటారు. నీళ్లల్లోకి బలమైన జంతువు ఏదొచ్చిన.. తన దృఢమైన దవడలతో పట్టుకుని.. మింగి చంపేస్తుంది. ఆకలి వేసిందంటే చాలు.. జంతువు ఎంతటిదైనా.. బలశాలి అయినా మీదదిపోతుంది. మరి అలాంటి మొసలికి బీపీ తెప్పిస్తే.. ఇంకేమైనా ఉందా.? కొందరికి మర్చిపోలేని గుణపాఠం నేర్పించింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇది చదవండి: అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.? మెంటలెక్కాల్సిందే
వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఇద్దరు వ్యక్తులు సరస్సులో చేపలు పట్టేందుకు బోటు వేసుకుని వెళ్లారు. నీటిలోకి ఎరను వేసి.. చేపలు పడుతున్నారు. ఇంతలో ఎక్కడ నుంచి చూసిందో.. ఆ ఎరను ఓ మొసలి గమనించింది. అటువైపు వేగంగా ఈదుకుంటూ వచ్చింది. ఈలోపు పడవలోని ఆ ఇద్దరు వ్యక్తులు.. ఎరను పైకి లాగేశారు. అసలే ఆకలి మీదుంది.? ఆపై ఎరను లాగేసుకుని మొసలికి బీపీ తెప్పించారు. దీంతో పడవ వైపునకు దూసుకొచ్చిన మొసలి.. ఒక్క ఉదుటున బోటు ఎక్కేందుకు ప్రయత్నించింది.
దీంతో అందులోని వాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అటు మొసలి కూడా బెదిరినట్టు ఉంది.. ఇక ఏం చేసేదిలేక.. నీటిలోనే అలా ఉండిపోయింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు దడుసుకోవడమే కాకుండా.. హడలిపోయాడు. మొసలికి కోపం తెప్పిస్తే.. ఇంతే మరి అనుకుంటూ.. కామెంట్స్ పెట్టారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.
Guy: This is so close man!
Alligator: But not close enough. Let’s fix that. pic.twitter.com/IMhTTPG9Jc
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) April 19, 2024
ఇది చదవండి: ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి