Viral Video: ఎయిర్‌పోర్ట్‌లోని లగేజీ కన్వేయర్ బెల్ట్‌పై పీతల సైన్యం.. షాకింగ్ వీడియో వైరల్

|

Jun 29, 2024 | 11:20 AM

ప్రయాణికులు తమ లగేజీని కన్వేయర్ బెల్ట్ నుంచి దింపడంలో ఇబ్బందులు పడుతుండగా, మరి కొందరు ప్రయాణికులు తమ లగేజీని దించే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో కొంతమంది ఈ అసాధారణ సంఘటనను వీడియో కూడా చేస్తున్నారు. అయితే ఆ సమయంలో కన్వేయర్ బెల్ట్‌ పై ఉన్న పీతలను అక్కడి నుంచి తొలగించేందుకు ఒక్క ఎయిర్‌పోర్టు ఉద్యోగి కూడా సమీపంలో కనిపించలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది ఇంకా వెల్లడి కానప్పటికీ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.

Viral Video: ఎయిర్‌పోర్ట్‌లోని లగేజీ కన్వేయర్ బెల్ట్‌పై పీతల సైన్యం.. షాకింగ్ వీడియో వైరల్
Crabs Video Viral
Image Credit source: Instagram/lyricaanderson
Follow us on

విమానాశ్రయంలో లగేజీని తీసుకెళ్ళే సమయంలో చాలా సార్లు అనుమతి లేని బంగారం, వెండి లేదా ఇతర వస్తువులను రహస్యంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించిన సంఘటనలకు సంబంధించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నారు. అంతేకాదు పాములు, తేళ్లు వంటి జంతువులను బ్యాగుల్లో పెట్టుకుని విమానాశ్రయానికి చేరుకుని ఆ తర్వాత పట్టుబడుతున్న ఇలాంటి ఘటనలు ప్రపంచంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి కేసు ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చర్చనీయాంశమైంది. వాస్తవానికి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. దీనిలో విమానాశ్రయంలో పీతల సైన్యం దాడి కనిపిస్తుంది. ఈ పీతలు బహుశా ప్రయాణీకుల బ్యాగ్ నుంచి బయటకు వచ్చి విమానాశ్రయంలోని లగేజ్ కన్వేయర్ బెల్ట్‌పై చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది.

కన్వేయర్ బెల్ట్‌పై భారీ సంఖ్యలో పీతలు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా సజీవంగా ఉన్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. వాటిలో చాలా కన్వేయర్ బెల్ట్‌ మీద ప్రయాణిస్తూ ముందుకు వెళుతుండగా, చాలా పీతలు ఆ బెల్ట్ నుంచి కిందకు అక్కడ. ఇక్కడ పాకుతున్నాయి. ప్రయాణికులు తమ లగేజీని కన్వేయర్ బెల్ట్ నుంచి దింపడంలో ఇబ్బందులు పడుతుండగా, మరి కొందరు ప్రయాణికులు తమ లగేజీని దించే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో కొంతమంది ఈ అసాధారణ సంఘటనను వీడియో కూడా చేస్తున్నారు. అయితే ఆ సమయంలో కన్వేయర్ బెల్ట్‌ పై ఉన్న పీతలను అక్కడి నుంచి తొలగించేందుకు ఒక్క ఎయిర్‌పోర్టు ఉద్యోగి కూడా సమీపంలో కనిపించలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది ఇంకా వెల్లడి కానప్పటికీ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లిరికాండర్సన్ అనే ఐడితో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 6.2 కోట్ల కంటే ఎక్కువ సార్లు చూశారు. అయితే 7 లక్షల 60 వేల మందికి పైగా దీన్ని లైక్ చేసారు .

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒకరు ‘పీతలు ఎక్కడ నుంచి వచ్చాయో లేదా తమ వస్తువులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే బదులు అక్కడ ఉన్న ప్రయాణీకులు వీడియోలు తయారు చేయడంలో బిజీగా ఉన్నారు’ అని ఫన్నీ కామెంట్ చేశారు. మరొకరు ‘ఎవరో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు.. అతన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకుని ఉండాలి’ అని అప్పుడు అధికారి దృష్టిని మళ్లించడానికి ఇలా చేశారు అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..