Viral Pics: గుంపుగా అడవి దున్నల ఊహించని ఎటాక్.. చెట్టెక్కి కూర్చున్న సింహం.. వైరల్ దృశ్యాలు..

అడవికి రారాజు సింహమే. ఇది జగమెరిగిన సత్యం. మృగరాజు వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వేట మొదలుపెడితే..

Viral Pics: గుంపుగా అడవి దున్నల ఊహించని ఎటాక్.. చెట్టెక్కి కూర్చున్న సింహం.. వైరల్ దృశ్యాలు..

Updated on: Jun 09, 2021 | 1:19 PM

అడవికి రారాజు సింహమే. ఇది జగమెరిగిన సత్యం. మృగరాజు వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వేట మొదలుపెడితే.. పెద్ద జంతువులను సైతం అలవోకగా మట్టికరిపిస్తుంది. అయితే అవతలి నుంచి గుంపుగా వస్తే మాత్రమే అడవికి రాజైనా, మృగరాజైనా తోక ముడుచుకోవాల్సిందే. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కెన్యా మసాయి మారా సఫారీలో జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆహారం కోసం మాటు వేసిన నాలుగు సింహాలు.. తమకు పక్కనే ఉన్న జింకలను వదిలేసి.. అడవి దున్నలపై కన్నేశాయి. అయితే ఆ సింహాల రాకను గమించిన అడవి దున్నలు.. ఒక్కసారిగా వాటి మీదకు గుంపుగా దండెత్తాయి. దీనితో మూడు సింహాలు అక్కడ నుంచి పారిపోగా.. ఒకటి మాత్రం ఆ దున్నల మధ్య ఇరుక్కుపోయింది. ప్రాణభయంతో అటు.. ఇటూ పరుగులు తీసిన ఆ మృగరాజు.. చివరికి ఎలాగోలా కస్టపడి ఓ చెట్టు ఎక్కి కూర్చుంది. కిందకు దిగుదాం అనుకుంటే ఏకంగా 500 పైగా అడవి దున్నలు రౌండప్ చేశాయి. చేసేదేమీ లేక అవి అక్కడ నుంచి వెళ్లేదాకా చెట్టు మీదే కూర్చున్న మృగరాజు.. చీకటి పడ్డాక అడవి దున్నలు వెళ్లిపోవడంతో.. బ్రతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి లగెత్తింది. ఈ దృశ్యాలను నార్వేకు చెందిన వైల్డ్ లైఫ్​ ఫొటోగ్రాఫర్​ ఓల్వ్​ థోక్లే(54) తన కెమెరాలో బంధించగా.. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి చదవండి:

రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్‌.. కుక్క ఓవర్‌ స్పీడ్‌.. చూస్తే షాక్ అవ్వాల్సిందే! వైరల్ వీడియో

ఆ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను.. నవ్వులు పూయిస్తున్న వధువు పెళ్లి ప్రకటన..

వీడు మామూలోడు కాదు.. సెహ్వాగ్, డివిలియర్స్‌ను మించిపోయాడు.. 20 బంతుల్లో సెంచరీ బాదేశాడు..