సోషల్ మీడియా ప్రపంచం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రపంచం నలమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అలాగే రకరకాల వైరల్ వీడియోలు తరచూ చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యానికి గుర్తి చేస్తే.. మరికొన్ని క్యూట్‌గా మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో ఓ అమ్మాయి చేసిన పని సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
వైరల్ వీడియో ప్రకారం.. తనను కలిసేందుకు వచ్చిన లవర్‌తో ఓ అమ్మాయి మాట్లాడుతున్నట్లు మీరు చూడవచ్చు. తన కోసం కష్టపడి వచ్చిన ప్రియుడికి చెమటలు పడితే.. ఆమె కర్చీఫ్‌తో తుడుస్తుంది. అతడు వద్దని వారిస్తున్నా.. తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆమె ఈ పనిని పదేపదే చేస్తుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
కాగా, ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఎంత ప్రేమబ్బా అక్కకు.. అబ్బాయి లక్కీ ఫెలో’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇట్టాంటి అమ్మాయి దొరికితే లైఫ్ సెటిల్ భయ్యా’ అని మరొకరు రాసుకొచ్చారు. లేట్ ఎందుకు మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి..