China Ancient Poem: చైనాలోని వుహాన్‌లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోనే ఉన్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. దాదాపు 2.5 సంవత్సరాలకు పైగా గడిచినా.. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి ముప్పు తప్పించుకోలేకపోతున్నాయి. దాదాపు అన్ని దేశాల ప్రభుత్వాలు కోవిడ్ -19 ముప్పును నివారించడానికి రకరకాల చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. అయితే ఈ వ్యాధి చైనాలో వెలుగులోకి వస్తుందని సుమారు 2500 సంవత్సరాల క్రితం అంచనా వేయబడిందని ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కరోనా ప్రపంచంలో ఎప్పుడు వస్తుందో ముందే చెప్పారు.? ఈ వ్యాధి గురించి ముందుగా ఓ పద్యంగా చెప్పారు.
చైనీస్ నోస్ట్రాడమస్ గా ప్రపంచ ప్రఖ్యాత గాంచిన లియు బోవెన్ దాదాపు 2500 సంవత్సరాల క్రితమే వైరస్ కు సంబంధించిన వార్తను కవిత రూపంలో చెప్పారు. అతని పాత కవితలలో ఒకదానికి సంబంధించిన ఒక సారాంశం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఎప్పుడు విముక్తి పొందుతుందని అందులో చెప్పారు. ఈ శ్లోకాలు మింగ్ రాజవంశం నుండి వచ్చిన ప్రవచనాల శ్రేణి. చైనా కు చెందిన ఎలుక, పంది సంవత్సరాల మధ్య సంభవించే భయంకరమైన విపత్తును సూచిస్తున్నాయి
ఈ ఏడాదిలో ప్రపంచం కరోనా మహమ్మారి నుంచి బయటపడనుంది
చైనాలో ప్రతి సంవత్సరాన్ని జంతువుతో సూచిస్తారు. దీంతో చైనాలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన సంవత్సరం 2019. ఇది పంది సంవత్సరం. 2020లో చైనీస్ న్యూ ఇయర్ జనవరి 25న వచ్చింది. ఇది ఎలుక సంవత్సరం. చైనీస్ చరిత్రలో లియు బోవెన్ శాసనం ఈ ఏడాదిలను సూచిస్తోంది. ఆయన రాసిన పద్యంలోని విశేషం ఏమిటంటే.. “డ్రాగన్ , పాము సంవత్సరాలు గడిచిపోతాయి”అయినప్పటికీ ఈ మహమ్మారి 2024, 2025 వరకు ఆగదని సూచిస్తుంది. ఇందులో డ్రాగన్ సంవత్సరం 2024, పాము 2025 చైనీస్ రాశిచక్ర గుర్తులకు అనుగుణంగా ఉంటుంది.
లియు ఒక తావోయిస్ట్ మాస్టర్. విషయ పరిజ్ఞానము కలిగిన వ్యక్తి.. గౌరవప్రదమైన ప్రధాన మంత్రిగా పనిచేశారు. అతను ప్రసిద్ధ పాన్‌కేక్ పద్యం సహా అనేక ప్రవచనాలు రాశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..