Watch: ఈ కానిస్టేబుల్‌కు నిజంగా సెల్యూట్ చేయాల్సిందే..! గుండెపోటుకు గురైన వ్యక్తికి ప్రాణం పోశాడు..

|

Oct 22, 2024 | 10:20 AM

అజయ్ కుమార్ (45) అనే వ్యక్తి బైకుపై వెళ్తుండగా స్కిడ్ అయ్యి డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే కుమార్‌కు గుండెపోటు వచ్చింది. ఘటనా స్థలంలో ఉన్న కానిస్టేబుల్ సూరజ్ గుప్తా వెంటనే గమనించి సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడాడు.

Watch: ఈ కానిస్టేబుల్‌కు నిజంగా సెల్యూట్ చేయాల్సిందే..! గుండెపోటుకు గురైన వ్యక్తికి ప్రాణం పోశాడు..
Cop Performs Life Saving Cpr
Follow us on

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఓ కానిస్టేబుల్‌ చేసిన పనితో ప్రజల నుంచి ప్రశంసలు పొందుతున్నాడు. నడిరోడ్డుపై గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ ఔదార్యాన్ని ప్రజలు కొనియాడుతున్నారు. అక్టోబర్‌ 21సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుండెపోటుకు గురైన 45 ఏళ్ల వ్యక్తిని కానిస్టేబుల్ ఎంతో చాకచక్యంగా కాపాడాడు. లక్నోలో అజయ్ కుమార్ (45) అనే వ్యక్తి బైకుపై వెళ్తుండగా స్కిడ్ అయ్యి డివైడర్‌ను ఢీకొట్టాడు.

ప్రమాదం జరిగిన వెంటనే కుమార్‌కు గుండెపోటు వచ్చింది. ఘటనా స్థలంలో ఉన్న కానిస్టేబుల్ సూరజ్ గుప్తా వెంటనే గమనించి సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడాడు. అజయ్ కుమార్ అనే వ్యక్తి తన మోటార్‌సైకిల్‌పై అల్కా ట్రైసెక్షన్ నుండి హజ్రత్‌గంజ్ క్రాసింగ్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తదుపరి చికిత్స నిమిత్తం సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. కుమార్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిసింది. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

అతని మోటార్ సైకిల్ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కుమార్‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. అప్పటికే ఘటనా స్థలంలో ఉన్న కానిస్టేబుల్ సూరజ్ గుప్తా పరిస్థితి తీవ్రతను గుర్తించి ప్రథమ చికిత్సగా సీపీఆర్ అందించి కుమార్ ప్రాణాలను కాపాడాడు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.