
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిన తర్వాత కంపెనీల పనితీరు చాలా ఈజీగా మారిపోయింది. అయితే అదే ఏఐని సరైన ప్రణాళిక, పర్యవేక్షణ లేకుండా వాడితే ఎలాంటి భారీ మూల్యం చెల్లించుకోవాలో చూపించే ఒక షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సంస్థ ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ప్లాట్‌ఫామ్‌కు తమ ఉద్యోగుల యాక్సెస్‌పై ఎటువంటి పరిమితులు విధించకపోవడంతో కేవలం ఒకే ఒక్క నెలలో ఏకంగా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,800 కోట్లు) బిల్లు చెల్లించింది. టెక్నాలజీ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన ఐటీ వైఫల్యాలలో ఒకటిగా నిలిచిపోవచ్చని ఏఐ కన్సల్టెంట్లు పేర్కొంటున్నారు.
నివేదికల ప్రకారం.. సదరు కంపెనీ తన ఉద్యోగులకు క్లాడ్ ఏఐ ప్లాట్‌ఫామ్‌ను ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉపయోగించుకునేలా అన్‌రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇచ్చింది. ఎంత ఖర్చవుతోంది? ఎవరు ఎంత వాడుతున్నారు? అని లైవ్‌లో చూసేందుకు ఎలాంటి రియల్ టైమ్ డాష్‌బోర్డ్‌లు కానీ బడ్జెట్ అలర్ట్‌లు కానీ ఆ కంపెనీ పెట్టుకోలేదు. పూర్తి స్వేచ్ఛ దొరకడంతో కంపెనీలోని ఇంజనీర్లు, ఉద్యోగులు వర్క్‌ఫ్లోల కోసం ఏఐని వాడటం మొదలుపెట్టారు. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా, వాటంతట అవే వందలాది పనులు చేసుకుపోయే ఏఐ కోడింగ్ ఏజెంట్‌లను, ఏజెంటిక్ పైప్‌లైన్‌లను క్రియేట్ చేశారు. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరాయంగా రన్ అవుతూ, భారీ లాంగ్ కాంటెక్స్ట్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి లక్షలాది పేజీల టెక్స్ట్‌ను ప్రాసెస్ చేయడం ప్రారంభించాయి.
ఏఐ ప్లాట్‌ఫామ్‌లు టోకెన్ల ఆధారంగా పనిచేస్తాయి. మనం అడిగే ప్రతి ప్రశ్న, ఏఐ ఇచ్చే ప్రతి జవాబు వెనుక నిర్దిష్ట సంఖ్యలో టోకెన్లు ఖర్చవుతాయి. ఉద్యోగులు సృష్టించిన లూప్ ప్రాసెస్ వల్ల టోకెన్ల వినియోగం ఊహించని స్థాయిలో పెరిగిపోయి.. చివరకు 4,800 కోట్ల రూపాయల కొండంత బిల్లును కంపెనీ ముందు నిలిపింది.
సరైన ప్లానింగ్ లేకుండా ఏఐ కోడింగ్ సాధనాలను దూకుడుగా అమలు చేయడం వల్ల అనేక దిగ్గజ కంపెనీలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి.
మైక్రోసాఫ్ట్ : ప్రతి ఇంజనీర్ ఏఐ కోడింగ్ కోసం నెలకు 500 నుండి 2,000 డాలర్లు (రూ.40 వేల నుండి రూ. 1.6 లక్షలు) వరకు ఖర్చు చేయడం ప్రారంభించడంతో మైక్రోసాఫ్ట్ ఇటీవల తన అంతర్గత క్లాడ్ కోడ్ లైసెన్సులను రద్దు చేయడం ప్రారంభించిందని ‘ది వెర్జ్’ పేర్కొంది.
ఉబెర్ : ఉబెర్ సంస్థ ఏప్రిల్ నాటికే తన 2026 ఏఐ బడ్జెట్ మొత్తాన్ని వాడేసింది. దీంతో ఏఐ ఖర్చులను సమర్థించడం తమకు కష్టంగా మారుతోందని ఆ కంపెనీ సీఓఓ స్వయంగా వెల్లడించారు.
మరోవైపు కంపెనీలు కూడా తమ ఉద్యోగులను వీలైనంత ఎక్కువగా ఏఐని ఉపయోగించేలా ఒత్తిడి తెస్తున్నాయి. అమెజాన్ సంస్థ అంతర్గతంగా కిరోరాంక్ అనే ఏఐ లీడర్‌బోర్డ్‌ను ప్రారంభించింది. ఎవరు ఎక్కువ ఏఐ టోకెన్లు వాడితే వారికి అంత మంచి పర్ఫార్మెన్స్ రేటింగ్ ఇస్తారనే భయం ఉద్యోగుల్లో మొదలైంది. దీంతో రేటింగ్‌ల కోసం ఉద్యోగులు ఏఐ ఏజెంట్లకు ఎలాంటి అర్థం లేని పనులను అప్పగిస్తూ టైంపాస్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కువ ఏఐ టోకెన్లను ఉపయోగించాలనే ఈ వింత ఒత్తిడిని టెక్ ప్రపంచంలో టోకెన్‌మాక్సింగ్ అని పిలుస్తున్నారు. ఈ దెబ్బతో అమెజాన్ ఆ లీడర్‌బోర్డ్‌ను పూర్తిగా మూసివేయవలసి వచ్చింది.
కళ్లు తెరిపించే ఈ తాజా సంఘటనల తర్వాత ఇప్పుడు గ్లోబల్ కంపెనీలన్నీ అలర్ట్ అవుతున్నాయి. ఏఐ వినియోగాన్ని ట్రాక్ చేయడానికి, ఎంత ఖర్చు అవుతుందో ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపడానికి ప్రత్యేకంగా రియల్ టైమ్ డాష్‌బోర్డ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. టెక్నాలజీ ఎంత స్పీడ్‌గా పెరిగినా, ఐటీ గవర్నెన్స్ లేకపోతే కంపెనీలు దివాలా తీయడం ఖాయమని ఈ 4,800 కోట్ల రూపాయల పొరపాటు నిరూపించింది.