Viral Video: ఓరి దేవుడో.. ఈ నాగుపాము ఏందిరా సామి.. తనను తానే మింగేస్తుంది..
ఒక పాము తనను తాను మింగుతున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో విడుదలై వైరల్ అవుతోంది. సాధారణంగా, పాములు ఆకలితో ఉన్నప్పుడు.. తినడానికి ఏమీ దొరకనప్పుడు, అవి ఇతర పాములను తింటాయి. అలాంటి లక్షణం ఉన్న పాములు కొన్నిసార్లు తమ తోకను చూసుకుని, అది వేరే పాము అని భావించి తినడానికి ప్రయత్నిస్తాయి.

పాములు తమ సొంత తోకను తినే సంఘటనలు అరుదైనవి. ఇటీవల అలాంటి ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అందులో పాము తన తోకను తినేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రవర్తనకు పలు కారణాలు ఉండవచ్చు. మొదటగా, పాము ఉన్న పరిసరాల్లో తాప ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే, అవి గందరగోళానికి గురై తమ తోకను ఇతర ప్రాణిగా భావించి దానిని తినే ప్రయత్నం చేస్తాయి. రెండవది.. ఆహారం దొరక్క ఆకలి ఎక్కువగా ఉంటే ఇలా చేయవచ్చు. ఆరోగ్య సమస్యలు లేదా మానసిక ఒత్తిడి కారణంగా కూడా పాములు ఈ ప్రవర్తన చూపుతాయి.
ముఖ్యంగా నాగుపాము వంటి విషపూరిత జీవులు, అరుదైన సందర్భాలలో తమ సొంత తోకను తినే ప్రవర్తన చూపుతాయి. తాజాగా “వరల్డ్ ఆఫ్ స్నేక్స్” అనే సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా షేర్ చేసిన వీడియోలో ఒక కోబ్రా పాము తన తోకను తినేందుకు ప్రయత్నించింది. వీడియో యజమాని @thewildhanbury తెలిపిన ప్రకారం.. పాములకు వేయాల్సిన ఆహారం గదిలో ఉంచడం వల్ల.. ఆ కోబ్రాకు తీవ్ర ఆహార తపన కలిగింది. ఆ మూడ్‌లో అది తన తోకను పట్టుకుని తినడం ప్రారంభించింది. దీంతో అతను చొరవ తీసుకుని ఆ పామును ఆ పరిస్థితి నుంచి విడిపించాడు. ఆ తర్వాత ఆ పాముకు ఆహారం ఇవ్వడంతో అంది ఎంచక్కా ఆరగించింది.
వీడియో దిగువన చూడండి…
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
