Viral News: కళ్లు దురద అని డాక్టర్ వద్దకు వెళ్లిన మహిళ.. బతికి ఉన్న పురుగులను చూసి షాక్..

|

Dec 09, 2023 | 8:40 AM

చైనాలోని కున్‌మింగ్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసుని చూసిన డాక్టర్లు సైతం షాక్ తిన్నారు. కళ్లలో దురద వస్తోందని ఒక మహిళ డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు.. ఆమె కళ్లను పరిశీలించిన వైద్యులకు ఆమె కనురెప్పలు  కను గుడ్ల మధ్య కీటకాలు పాకుతున్నట్లు కనుగొన్నారు. పరిస్థితి చేయి దాటిందని అర్థం చేసుకున్న డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేశారు. డాక్టర్లు మహిళల కళ్లను చూసి కళ్ల మధ్య కీటకాలు కదులుతున్నట్లు కనిపించడంతో వారు షాక్‌కు గురయ్యారు.

Viral News: కళ్లు దురద అని డాక్టర్ వద్దకు వెళ్లిన మహిళ.. బతికి ఉన్న పురుగులను చూసి షాక్..
Live Worms In Eyes
Follow us on

సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఇంద్రియాల్లో అత్యంత సున్నితమైనవి కళ్ళు అని చెప్పవచ్చు. చిన్నపాటి ఇబ్బంది ఏర్పడినా సరే కళ్ళు ఎర్రగా మారతాయి. కంటికి ఏదైనా సమస్య ఏర్పడితే ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు ఒకరు కూర్చోలేరు లేదా లేవలేరు. అటువంటి పరిస్థితిలో.. కళ్ళలో జీవించి ఉన్న కీటకాలు ఉన్నాయని.. అందునా 60 సజీవ కీటకాలున్నాయని తెలిస్తే.. వినడానికి ఇది కాస్త వింతగా అనిపించవచ్చు. ఇది నిజం.. ఈ సంఘటన మొత్తం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

చైనాలోని కున్‌మింగ్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసుని చూసిన డాక్టర్లు సైతం షాక్ తిన్నారు. కళ్లలో దురద వస్తోందని ఒక మహిళ డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు..  ఆమె కళ్లను పరిశీలించిన వైద్యులకు ఆమె కనురెప్పలు  కను గుడ్ల మధ్య కీటకాలు పాకుతున్నట్లు కనుగొన్నారు. పరిస్థితి చేయి దాటిందని అర్థం చేసుకున్న డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేశారు. డాక్టర్లు మహిళల కళ్లను చూసి కళ్ల మధ్య కీటకాలు కదులుతున్నట్లు కనిపించడంతో వారు షాక్‌కు గురయ్యారు. వాటిని ఆపరేషన్ చేసి తీస్తున్నప్పుడు వాటి సంఖ్య 60 కంటే ఎక్కువగా ఉంది.

కీటకాలు కళ్లలోకి ఎలా చేరుతాయంటే

నివేదిక ప్రకారం ఆ కీటకాలు సాధారణంగా ఈగ ద్వారా వ్యాపిస్తాయి. అయితే ఆ మహిళ తన పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కలతో ఆడుకునేటప్పుడు వాటి శరీరం మీద ఉన్న లార్వా నుండి ఈ కీటకాలు తన కంటిలోకి చేరుకున్నట్లు నమ్ముతుంది. జంతువులతో ఆడుకున్న తర్వాత అదే చేతులతో తన కళ్లను రుద్దుకోవడం వల్లే తనకు ఈ సమస్య వచ్చిందని ఆ మహిళ వైద్యులకు చెప్పింది. ఆ సమయంలో ఈ ఇన్ఫెక్షన్ ఆమె శరీరంలో వ్యాపించి ఉండాలి.

ఇవి కూడా చదవండి

అంతేకాదు చాలా కాలంగా కళ్ల దురదతో బాధపడుతున్నానని..  అయితే ఒక రోజు అకస్మాత్తుగా దురద బాగా పెరిగి కంటి నుంచి ఒక పురుగు పడిపోయిందని వైద్యులకు చెప్పింది. దీంతో ఆమె భయపడి ఆస్పత్రికి చేరుకుంది. అయితే ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం ఇది మొదటిది సారి కాదు.. 2020లో 60 ఏళ్ల చైనీస్ మహిళకు ఆపరేషన్ చేసి ఆమె కళ్లలోంచి 20కి పైగా మాగ్గోట్లను తొలగించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..