చిన్న పిల్లలు (Children) ఉన్న ఇల్లు ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. వారు చేసే చిన్న చిన్న పనులు, ముద్దు ముద్దు మాటలు, వాళ్ల ఎక్స్ప్రెషన్స్ మనకు ఎంతో ఆనందం, ఆహ్లాదం కలిగిస్తుంది. వారికి సంబంధించిన ఫన్నీ ఫొటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోలలో పిల్లల అల్లరి, అమాయకత్వం నెటిజన్లు దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే కొన్ని వీడియోలు మాత్రం మన హృదయాలను హత్తుకునేలా ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్నారి తన తల్లితో కలిసి ఐస్ క్రీం తింటూ కనిపించింది. ఐస్ క్రీం తిన్నాక ఆ చిన్నారి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ తో పాటు, తన తల్లితో కలిసి ఎంతో ప్రేమగా నవ్వడాన్ని మీరు చూడవచ్చు. ఈ వీడియోను పదే పదే చూసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నార. దీంతో ఈ వీడియో కొంత సమయంలోనే వైరల్ (Viral) గా మాంది. పిల్లలంటే దేవుడికి ఇష్టం అన్న సామెతను ఈ వీడియో నిజం చేసినట్లు అనిపిస్తుంది.
The baby’s reaction to ice cream. ???pic.twitter.com/byGHK3CKAY
ఇవి కూడా చదవండి— Figen (@TheFigen) July 21, 2022
ఈ వీడియోను @TheFigen అనే ఖాతా ద్వారా Instagramలో పోస్ట్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోను 17 లక్షల మంది చూడగా.. ఆ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ క్లిప్ ను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. నేను ఈ చిన్నారితో ప్రేమలో పడ్డానని ఒకరు, పిల్లల అందమైనతనం నా హృదయాన్ని గెలుచుకుందని మరో నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..