Samntah on Naga Chaitanya: మాకు అసలే పడేది కాదు.. భర్త నేచర్‌పై సామ్ షాకింగ్ కామెంట్స్..(వీడియో)

Samntah on Naga Chaitanya: మాకు అసలే పడేది కాదు.. భర్త నేచర్‌పై సామ్ షాకింగ్ కామెంట్స్..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Jul 23, 2022 | 8:38 AM

ఫర్ ది ఫస్ట్‌ టైమ్ తమ మారిటల్ లైఫ్‌పై నోరు విప్పింది సమంతా రూత్‌ ప్రభు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్ హోస్ట్‌గా చేస్తున్న కాఫీ విత్ కరణ్‌ షోలో సమంత గెస్ట్‌గా వచ్చారు.


ఫర్ ది ఫస్ట్‌ టైమ్ తమ మారిటల్ లైఫ్‌పై నోరు విప్పింది సమంతా రూత్‌ ప్రభు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్ హోస్ట్‌గా చేస్తున్న కాఫీ విత్ కరణ్‌ షోలో సమంత గెస్ట్‌గా వచ్చారు. అక్కడ కరణ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సూటిగా ఆన్సరిచ్చారు సమంత. ముఖ్యంగా చైతూతో తన కాపురం గురించి సెన్సిటివ్ ఇష్యూస్‌ని టచ్ చేశారు. తామిద్దరం ఒకే గదిలో ఉన్నప్పుడు… దగ్గర్లో ఆయుధాలేవీ లేకుండా చూసుకుంటామని, తమ మధ్య కాన్వర్జేషన్ అంత హీటెడ్‌గా ఉండేదని చెప్పారు సమంత. రిసెంట్ టైమ్స్‌లో సమంత ఇంతలా ఓపెనప్ కావడం ఇదే ఫస్ట్‌ టైమ్. సమంత-చైతూ విడాకుల మిస్టరీ గురించి సినిమా సర్కిల్స్‌లోనూ ఫ్యాన్స్‌లోనూ చాలారోజులుగా టాక్ నడుస్తూనే ఉంది. అంతటి ముచ్చటైన జంట ఇంత ఈజీగా ఎలా విడిపోయింది అంటూ అనేక కారణాల గురించి ఆరా తీశారు అభిమానులు. కరణ్ కూడా తన షోలో సమంతను అడిగారు. మీ భర్త నుంచి విడిపోయేటప్పుడు మీ మైండ్ స్టేటస్ ఏంటి అని. కానీ… భర్త అనే మాట వినడానికే ఆమె ఇష్టపడలేదు. అతడు మాజీ భర్త అలాగే పిలవండి అని కరణ్‌కి సజెస్ట్ చేశారు సామ్. తాము జస్ట్‌ లైక్‌ దట్ అలా ఊరికే విడిపోలేదని.. ఆ విడిపోవడం వెనుక చాలా గడబిడ జరిగిందని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 23, 2022 08:38 AM