
అక్రమ రవాణాకు అడ్డు కట్ట వేసేందుకు పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఎంతలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్రమార్కులు తెలివి మీరిపోయారు. సరికొత్త మార్గాల్లో యదేచ్చగా తమ దందాను కొనసాగిస్తున్నారు. సినిమాల ప్రభావమో.. లేక మరేదోనో.. వారు మాదకద్రవ్యాలు, విదేశీ కరెన్సీ, బంగారాన్ని విదేశాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న పద్దతి చూసి.. ఏకంగా అధికారులే షాకైన సందర్భాలు లేకపోలేదు. అయితే పోలీసులు ఏమైనా తక్కువా.. అలాంటి వారి ఆటలు కట్టించి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ఇటీవల ఓ వ్యక్తి బంగారాన్ని ఎక్కడ దాచిపెట్టి దొరికిపోయాడో చూస్తే.. మీకూ కచ్చితంగా ఫ్యూజులు ఎగిరిపోతాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 3వ తేదీన అబుదాబీ నుంచి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు 6E-1412 నెంబర్‌తో ఓ విమానం వచ్చింది. రోజూ మాదిరిగానే ఆ సమయంలోనూ కస్టమ్స్ అధికారులు తమ తనిఖీలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆ ఫ్లైట్‌లో నుంచి దిగిన ప్రయాణీకుల్లో ఓ వ్యక్తిపై వారికి అనుమానం వచ్చింది. ఇక కస్టమ్స్ అధికారులను చూడగానే అతడు తత్తరపాటుకు గురై.. పొంతలేని సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. దీంతో సదరు వ్యక్తి బ్యాగ్ చెక్ చేయగా.. ఓ ఎలక్ట్రిక్ మోటారు కొంచెం తేడాగా కనిపించింది. దాన్ని పగలకొట్టి చూడగా.. అందులో 1.796 కిలోల బంగారం బయటపడింది. ఆ గోల్డ్ విలువ సుమారు రూ. 95.15 లక్షలు ఉంటుందని అంచనా. ఆ తర్వాత సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. అతడిపై కేసు నమోదు చేశారు కస్టమ్స్ అధికారులు. కాగా, అధికారులు ఆ మోటారు నుంచి బంగారాన్ని వెలికి తీసే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.
Based on Intel, Customs intercepted a pax who arrived from Abu Dhabi by 6E-1412 on 03.04.2023.
On examination of his checked-in baggage, gold weighing 1796 gms valued at ₹95.15 Lakh concealed inside an electric motor was recoverd/ seized under the Customs Act, 1962.@cbic_india pic.twitter.com/v6a5J06CuQ— Chennai Customs (@ChennaiCustoms) April 5, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం