భారతదేశంలో ప్రతిభకు కొరత లేదు. సెలబ్రిటీ అయినా, ఫ్రెషర్ అయినా సరే.. ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే రికార్డు సృష్టిస్తారు. దీపావళి సందర్భంగా ఒక చెఫ్ 24 గంటల్లో 10,000 దోసెలు తయారు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అతడు చేసిన ఈ వింత చాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అతని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో అతన్ని కలుసుకుని ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ మరింతగా ప్రోత్సహిస్తున్నారు. అతను మరెవరో కాదు.. నాగ్‌పూర్‌కి చెందిన ఫేమస్ చెఫ్ విష్ణు మనోహార్..ఇతన్ని అక్కడి స్థానికులు ప్రౌడ్ ఆఫ్ నాగ్‌పూర్ అని పిలుస్తారు.
వంటలో అద్భుతమైన టాలెంట్ కలవాడు చెఫ్ విష్ణు మనోహర్..అతని ప్రతిభతో అతను పరిచయం అవసరం లేని ప్రముఖ చెఫ్‌గా పేరుతెచ్చుకున్నాడు. అతన్ని కుక్కింగ్ స్టైల్ చూస్తేనే.. తన అభిరుచి స్పష్టంగా కనిపిస్తుంది. అతని చేతులతో ఏది వండినా భోజన ప్రియులు వేళ్లు కూడా నాకేస్తారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. తన టాలెంట్‌తో అతను ఇప్పటివరకు 25 ప్రపంచ రికార్డులు సృష్టించాడు.
చెఫ్ విష్ణుమనోహర్.. ప్రస్తుత దోస ఛాలెంజ్‌కి ముందు, అయోధ్యలో 7000 కిలోల ‘రామ్ హల్వా’ని వండారు. దేశంలోనే అతిపెద్ద వెజిటేరియన్ కబాబ్‌తో పాటు అతిపెద్ద పరాఠాను కూడా తయారు చేశాడు. తన రికార్డు బుక్కులో 52 గంటల నాన్-స్టాప్ వంట మారథాన్‌ను పూర్తి చేసిన ఘనత కూడా ఉంది. ఇప్పుడు తను చేసిన ఛాలెంజ్‌తో అతను నాగ్‌పూర్‌ను ప్రపంచ వేదికపైకి తీసుకువచ్చాడు. తన తాజా ఛాలెంజ్‌లో 24 గంటల్లో 10000 దోసెలు తయారు చేసేందుకు రెడీ అంటున్నాడు.
ఈ సందర్భంగా అన్నపూర్ణ మాత ఆశీస్సులతో విష్ణువు వంటగది తడిసి ముద్దయింది. కేవలం మొదటి 9 గంటల్లోనే 6750 దోసెలు తయారు చేయబడ్డాయి. విష్ణు మనోహర్ చేస్తున్న ఈ మాయాజాలాన్ని చూసేందుకు వేలాది మంది తరలివస్తున్నారు. రాలేని వారు లైవ్ స్ట్రీమింగ్, యూ ట్యూబ్‌లో వీడియోలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
సెలబ్రిటీ చెఫ్ విష్ణు మనోహర్ ఇప్పుడు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒకేసారి 2 ప్రపంచ రికార్డులు సృష్టించడానికి రెడీగా ఉన్నాడు.. మొదటిది ’24 గంటల పాటు నాన్‌స్టాప్‌గా దోసెలు తయారు చేయడం’, మరొకటి ’24 గంటల్లో గరిష్ట సంఖ్యలో దోసెలు తయారు చేయడం’. అతని ‘దోస మారథాన్’ అక్టోబర్ 27న బజాజ్ నగర్‌లోని విష్ణుజీ కి రసోయ్‌లో ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైంది.
ఈ వీడియోపై క్లిక్ చేయండి…
#WATCH | Nagpur: Chef Vishnu Manohar says, “… I will be making dosas for 24 hours. Before this I had made khichdi, baingan bharta, and misal in large quantities… I will be making nearly 750-800 dosas in one hour, so on average, I will be able to make about 10000 dosas in 24… pic.twitter.com/Y4u5oiDDZC
— ANI (@ANI) October 28, 2024
విష్ణు ప్రభాకర్ 8 పాన్లతో 3 భట్టీలను ఉపయోగిస్తున్నారు. 1000 కిలోల దోసెపిండితో దోసెలను చట్నీ, సాంబార్‌తో వడ్డించారు. ఇకపోతే, ఉచిత ప్రవేశం ఉండటంతో భారీగా జనం బారులు తీరుతున్నారు. ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ పద్ధతిలో దోస సర్వ్ చేశారు. ఈ సందర్భంగా 24 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు చేశారు. హిందీ, మరాఠీ పాటలు ప్లే అవుతూనే ఉన్నాయి. గజల్స్, భజనలు, స్టాండ్-అప్ కామెడీ ఏర్పాటు చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..