AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI death calculator: ఓర్నీ.. మనిషి ఎప్పుడు పోతాడే కూడా కనిపెట్టే మెషీన్ వచ్చేసింది…

రోజులు మారిపోతున్నాయ్. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏఐ వచ్చేసింది. ఏది మాయో.. ఏది ఫేకో తెలియని పరిస్థితులు కూడా వచ్చాయ్. ఇక మన చావు ఎప్పుడో కూడా చెప్పే క్యాలిక్లేటర్ డెవలప్ చేశారు సైంటిస్టులు.

AI death calculator: ఓర్నీ.. మనిషి ఎప్పుడు పోతాడే కూడా కనిపెట్టే మెషీన్ వచ్చేసింది...
AI Death Calculator
Ram Naramaneni
|

Updated on: Oct 28, 2024 | 6:21 PM

Share

వాన రాకడ ప్రాణం పోకడ ఎవ్వరికీ తెలియదు అనేది సామెత.. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో వాన ఎప్పుడు వస్తుంది.. పిడుగులు ఎక్కడ పడతాయో తెలుసుకుంటున్నాం. అయితే మనిషి ఆయురార్ధం కూడా కనిపెట్టే రోజులు వస్తాయా అని ఒకప్పుడు డౌట్ ఉండేది . అయితే ఇప్పుడు అంత ఏఐ జమాన నడుస్తుంది కాదా. దాని పుణ్యమా అని ఓ మనిషి ఎప్పుడో పోతాడో డేట్‌తో సహా కనిపెట్టే కొత్త టెక్నాలజీ కనిపెట్టారు సైంటిస్టులు.

ఆన్ లైన్ యాప్స్‌లో ఐటెమ్స్ ఆర్డర్ పెడ్తే ఇంటికి డెలివరీ ఎప్పుడు అయ్యేది టైంతో చెప్పేస్తాయి సదర్ యాప్స్. ఇక వాతావరణ శాఖవారు వానలు ఎప్పుడొస్తాయ్.. తుఫాన్లు ఎప్పుడు అటాక్ చేస్తాయో ముందుగానే పసిగట్టి చెబుతున్నారు. ఇప్పుడు మనిషి జీవంఎ ప్పుడు పోతుందో కూడా కచ్చితంగా అంచనా వేసి చెప్పే టెక్నాలజీ కనిపెట్టారు బ్రిటన్ సైంటిస్టులు.

ఈసీజీ చేసి పల్సు రేటును ఫిగర్ ఔట్ చేసి.. ప్రాణం ఎప్పుడు పోతదో ముందే తెల్సుకోవచ్చట.. దానికి సూపర్‌ హ్యూమన్‌ ఏఐ డెత్‌ కాలిక్యులేటర్‌ అని పేరు కూడ పెట్టారు. లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ హెల్త్‌కేర్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ ట్రస్టు సహా రెండు పెద్ద హాస్పిటల్స్ ఆల్రెడీ దీని మీద టెస్టులు కూడా చేశారట.. మరో రెండు మూడేళ్లలో బ్రిటన్‌లోని అన్ని ఆస్పత్రుల్లో ఈ సూపర్ హ్యూమన్ ఏఐ డెత్ క్యాలిక్యులేటర్స్ అందుబాటులోకి వస్తాయంటున్నారు. ఇన్నాళ్లు చావు ఎప్పుడు వస్తదో తెలియదు కాబట్టి దాని గురించి ఫీకర్ లేకుండా హ్యాపీగా బతుకుతున్నారు చాలామంది. కానీ ఇక టైం డేటు కూడా చెప్తే.. ఇక లైఫ్‌లో పీస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. అదీగాక మనలాంటి దేశాల్లో పలాన రోజునాడు మీ ప్రాణం పోతదంటే ముహుర్తం..వర్జ్యం, రాహుకాలం..దుర్ముహుర్తం లేకుంట పలాన టైంలోనే ప్రాణం పోవాలనే పట్టు పట్టేవాళ్లు కూడా  ఎక్కువైపోతారు. ఇప్పుడు చూస్తలేమా.. డేట్లు , ముహుర్తాలు చూషి మరీ కాన్పులు చేయించుకుంటున్నారుగా.. ఇక డెత్ క్యాలిక్యులేటర్ వస్తే చావులకు కూడ ముహుర్తాలు పెట్టుకుంటారు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్