
భూమిపై అత్యంత వేగవంతమైన జంతువు ఏది అంటే టక్కున గుర్తొచ్చేది చిరుత. గంటకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోయే ఈ అద్భుతమైన జంతువు వేగానికి ఏది కూడా సరితూగదు. ఎంత దూరంలో ఉన్నా, చిరుత తన లక్ష్యాన్ని వెంటనే ఛేదిస్తుంది. దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియో చూసి అవాక్కవుతున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో చిరుత తన జింకను వెంబడించే వేగం చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. చాలా దూరంలో ఉన్న తన లక్ష్యాన్ని గుర్తించిన చిరుత, ఒక్కసారిగా వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. దాని వేగం ఎంత ఎక్కువగా ఉందంటే.. కెమెరా కూడా దాని కదలికలను పూర్తిగా పట్టుకోలేనంతగా ఉంది. కేవలం కొన్ని సెకన్లలోనే జింకను పట్టుకుని తినేసింది.
ఈ 20 సెకన్ల వీడియోను ట్విట్టర్‌లో (@TheeDarkCircle) షేర్ చేశారు. ఆ వీడియోకు ‘‘చిరుత కేవలం 3 సెకన్లలో 0 నుండి దాదాపు 100 kmph) వేగాన్ని అందుకుంది. ఇది ర్ట్స్ కార్ల కంటే కూడా వేగవంతమైనది’’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పటికే వేలల్లో వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇది ప్రకృతి యొక్క నిజమైన రేసు అని ఒకరు కామెంట్ చయగా.. “ఒలింపిక్స్‌లో బంగారు పతకం ఎప్పుడూ చిరుతకే వస్తుందని మరొకరు ఫన్నీ కామెంట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Cheetah accelerate from 0 to 60 mph in just 3 seconds, faster than most sports cars. pic.twitter.com/Z2heAVyMjC
— Wildlife Uncensored (@TheeDarkCircle) October 15, 2025
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..