
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది ప్రతి ఒక్కరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. అదే సమయంలో ఆందోళనకరంగా ఉంది. ఈ వీడియోలో పోలీసులకు పట్టుబడిన కొంతమంది జేబు దొంగలు కెమెరా ముందు తమ చోర కళను ప్రదర్శించారు. నిందితులు బస్సులు, రద్దీగా ఉండే మార్కెట్లలో ఎలా జేబు దొంగతనం చేస్తారో లైవ్ డెమో ద్వారా చూపిస్తున్నారు ఈ వీడియోలో.. అయితే, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు. కానీ, ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
పోలీసులు ఆ ముఠాను ఎలా పట్టుకున్నారు?
అందిన సమాచారం ప్రకారం, పోలీసులు ఒక ముఠాలో పనిచేస్తున్న దొంగలను అరెస్టు చేశారు. వారు ప్రధానంగా బస్సులు, మార్కెట్లు, ఇతర రద్దీగా ఉండే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేశారు. అరెస్టు తర్వాత పోలీసు అధికారులు ప్రశ్నించినప్పుడు, నిందితులు ఎటువంటి సంకోచం లేకుండా అమాయకుల నుండి ఎలా దోచుకుంటారో, వారి దొంగతనం స్టైల్ ఎలా ఉంటుందో క్లీయర్ చూపించారు. నిందితుడి వివరణ విన్న తర్వాత అక్కడ ఉన్న అధికారి కూడా ఆశ్చర్యపోయారు.
బాధితులను ఎలా ఎంచుకోవాలి?
నిందితుడు వీడియోలో తన బృందం మొదట విలువైన వస్తువులను తీసుకెళ్లే వ్యక్తుల కోసం వెతుకుతుందని చెప్పాడు. అలాంటి వారు వ్యక్తులు తరచుగా జేబుల్లో చేతులు పెట్టుకుంటూ ఉంటారని, లేదంటే, జేబులు ఉబ్బేత్తుగా ఉన్నవారు, గుంపులో అశాంతిగా కనిపించే వారిని టార్గెట్‌గా చేసుకుంటారని చెప్పారు. అలాంటి బాధితుల్ని గమనించి సమాచారం ఇవ్వటంతో.. సరైన టైమ్ చూసి..మిగిలిన ముఠా ఆ వ్యక్తి చుట్టూ చేరుతుందని చెప్పాడు. తర్వాత, పరిస్థితిని అంచనా వేయడానికి ముందు జాగ్రత్తగా వారి వెనుక జేబులో రెండు వేళ్లను ఉంచుతారు. తర్వాత, వారు బ్లేడ్ లేదా చిన్న కత్తిని ఉపయోగించి బాధితుల జేబుకు చిన్న చిల్లు పెడతారు. బాధితుడికి ఇది ఏమాత్రం తెలియదు. కోత జరిగిన వెంటనే, ఆ ముఠా డబ్బు లేదా పర్సు తీసుకొని వేర్వేరు దిశల్లో వెళ్లిపోతుంది. ఇదంతా చాలా త్వరగా జరుగుతుంది. కాబట్టి, బాధితులు తమ జేబులు, పర్స్‌లను చెక్ చేసుకునే వరకు ఏమీ తెలియకుండా అంతా జరిగిపోతుంది.
అంతేకాదు.. ఇలాంటి ముఠాలకు ప్రత్యేక కోడ్ లాంగ్వేజ్ కూడా ఉంటుందని చెప్పాడు. నిందితులు వీడియోలో తమ కోడ్ భాషను కూడా బయటపెట్టారు. వాళ్ళు డబ్బును ‘పథే’ అని పిలిచారు. ఆ పర్సును ‘కిట్’ అని కూడా అంటారు. జనసమూహంలో మాట్లాడేటప్పుడు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇలా చేశారు. ఇది విన్న అక్కడ ఉన్న పోలీసు అధికారి కూడా ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయారు.
రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను అవగాహన ప్రచారంగా మాత్రమే చూడాలని పోలీసులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..