Horse Cat Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా గుర్రం, పిల్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాజులు, చక్రవర్తుల కాలంలో గుర్రాలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడు గుర్రాలను పెళ్లిళ్లు, గుర్రపు స్వారీ వంటి క్రీడలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. అయితే.. గుర్రాలకు సంబంధించిన వీడియోలు చాలా తక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. పిల్లులకు సంబంధించినవి చాలానే వైరల్ అవుతుంటాయి. అయితే.. తాజాగా పిల్ల, గుర్రానికి సంబంధించిన ఫన్నీ వీడియో (Social Media) ఒకటి బాగా వైరల్ అవుతోంది.. ఇది చూస్తే మీరు నవ్వకుండా అసలు ఉండలేరు.
ఈ వైరల్ వీడియోలో పిల్లి గుర్రంపై స్వారీ చేయాలనుకుంది.. కానీ పిల్లి స్వారీ చేయడం మాత్రం గుర్రానికి అస్సలు ఇష్టం లేదు. దీంతో గుర్రానికి చిర్రెత్తుకొచ్చి పిల్లిని కిందపడేసి కాలితో తన్నుతుంది. దీంతో పిల్లి అక్కడి నుంచి పారిపోతుంది. పిల్లి దూకిన వెంటనే గుర్రం దానిని కిందపడేస్తుంది. దీంతోపాటు కాస్త భయపడి ఒళ్లు జలధరిస్తుంది. అయితే, గుర్రం దగ్గర నిలబడి ఉన్న ఒక వ్యక్తి దానిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ వీడియో చూసి చాలామంది నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ వీడియో..
ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో bestialnature అనే యూజర్ షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 42 వేలకు పైగా వీక్షించగా.. వందలాది మంది వీడియోను కూడా లైక్ చేసారు. అదే సమయంలో పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. గుర్రానికి పిల్లి స్వారీ చేయడం ఇష్టం లేదేమోనంటూ ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు.. పిల్లి తిక్క అనిగిందంటూ కామెంట్ చేశారు.
Also Read: