చాలామంది తమ ఇళ్లల్లో కుక్కలను పెంచుకుంటారు. అలాగే మరికొందరు పిల్లులను కూడా పెంచుకుంటారు. చాలా ఇళ్లల్లో పిల్లులు కనబడతాయి. ఈ పిల్లలను పెంచుకుంటే అసలు ఎలకల గొడవే ఉండదని చాలామంది వీటిని తమ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. మరికొందరు ఇష్టంతో పిల్లులను పెంచుకుంటారు. వాస్తవానికి పెంపుడు కుక్కుల్లో జాతులు ఎలా ఉంటాయో పిల్లుల్లో కూడా అలాగే ఉంటాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో కూడా చాలామంది పిల్లులలను పెంచుకుంటారు. మరో విషయం ఏంటంటే కుక్కలను పెంచుకుంటే అవి ఎలా విశ్వాసం చూపిస్తాయో.. పిల్లులు కూడా తమ యజమానుల పట్ల విశ్వాసం చూపిస్తాయి. అలాగే ఇంటి పరిసరాల్లో ఏదైనా అనుమానస్పదంగా కనిపించే వాటిని కూడా తరమేస్తాయి. అయితే కొన్నిసార్లు ఆ పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తే అవి కూడా తమ రక్షణ కోసం కొరికేందుకు వస్తాయి. కానీ ఎక్కవ మట్టుకు పిల్లులు తరమగానే భయంతో పారిపోతాయి.
అయితే ఇప్పుడు మీరు ఈ వీడియోను చూస్తే మాత్రం పిల్లులు కూడా ఇంత భయంకరంగా ఉంటాయా అని ఆశ్యర్యం వ్యక్తం చేస్తారు. ఒక అడవి మృగంలా ఓ పిల్లి ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఒక ఇంట్లోని ఇద్దరు వ్యక్తులు తమ వస్తువులు ఒకచోట నుంచి మరోచోటుకి జరుపుతుంటారు. వారితో పాటు వాళ్లు పెంచుకునే ఓ పిల్లి కూడా అక్కడే ఉంటుంది. అయితే అతను ఫ్రిడ్జ్‌ను జరుపుతూ ఉంటాడు. అతని కాళ్ల కింద ఉన్న పిల్లి ఉంటుంది. కానీ అదే సమయంలో ఒక్కసారిగా అది ఓ మృగంలా ప్రవర్తించడం మొదలుపెట్టింది. తన యజమానిపై దాడి చేసింది. అతను షాక్ అయిపోయి భయంతో ఓ పరదా వెనుక దాక్కుంటాడు. దాని వెనకకు కూడా ఆ పిల్లి వచ్చి అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత అతను తలపు వెనక దాక్కుంటాడు. అయినా కూడా ఆ పిల్లి అతనిపై దాడి చేసేందుకు యత్నిస్తుంది. ఆ తర్వాత చివరికి అతను ఆ పిల్లిని పరదా వెనకకి పంపించేలా చేసి దాని దాడి నుంచి తప్పించుకుంటాడు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలోని డేట్‌ను గమనిస్తే ఈ ఏడాది మే నెలలో జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వీడియోను 9.4 మిలియన్ల మంది వీక్షించారు. అసలు ఎలాంటి కారణం లేకుండా ఆ పిల్లి తన యజమానిని అలా ఎందుకు దాడి చేసిందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విభిన్న రీతుల్లో కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆ యజమాని పట్ల సానుభూతి చూపించారు. అలాగే మరికొందరు తమ పిల్లులతో కూడా జరిగిన అనుభవాలను పంచుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.
Cat owner suddenly gets attacked by his cat unprovoked and for no reason pic.twitter.com/X1TeAEFZCT
— CCTV IDIOTS (@cctvidiots) August 6, 2023