Viral Video: అరే ఏంటి బాయ్ నీ లొల్లి.. సముద్ర సింహాన్నే కొట్టిన పిల్లి.. షాకింగ్ వీడియో
Cat slaps Sea Lion: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.
Cat slaps Sea Lion: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. కొన్ని సంఘటనలు చూస్తే నెటిజన్ల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా.. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ వీడియోలో ఒక పిల్లి సముద్ర సింహాన్ని చెంపదెబ్బ కొట్టింది. ఇది చూసి అందరూ పిల్లి ఏం తక్కువది కాదు అంటూ (Social Media) నోరెళ్లబెడుతున్నారు. పిల్లి అందరితో చాలా చనువుగా ఉంటుంది. హాని తలపెట్టే వాటి దగ్గరికి అస్సలు వెళ్లదు. అది ఎవరితోనైనా దగ్గర అయితే ఆలోచించకుండా మరి మారం చేస్తుంటుంది. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చాలానే చూసుంటాం..
వైరల్ వీడియోలో మీరు పిల్లి ముందు హాయిగా సేద తీరుతున్న ఒక సముద్ర సింహాన్ని చూడవచ్చు. ఈ క్రమంలో సముద్ర సింహం.. పిల్లిని వింత స్వరంతో ఆటపట్టించడాన్ని మీరు చూడవచ్చు. మొదట పిల్లి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆ తర్వాత సముద్ర సింహంపై కోపం చూపిస్తుంది. వెంటనే సముద్రపు సింహాన్ని చెంపదెబ్బ కొడుతుంది. దీంతో సముద్ర సింహం కూడా నిశ్శబ్దంగా నీటిలోకి వెళుతుంది. దీనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
వైరల్ వీడియో..
View this post on Instagram
ఈ వీడియోను outofcontextanimals అనే యూజర్ Instagramలో షేర్ చేశారు. దీనిని లక్షలాది మంది వీక్షించి.. పలు రకాల తమాషా కామెంట్లు సైతం చేస్తున్నారు. ఈ క్లిప్ చూసిన తర్వాత నవ్వును నియంత్రించడం చాలా కష్టమంటూ ఓ యూజర్ పేర్కొనగా.. ఈ పిల్లి ప్రెస్టేషన్‌లో అలా కొట్టిందేమో అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: