Viral Video: అదృష్టం అంటే ఈ పిల్లిదే.. స్టైల్‌గా ఎలా కునుకుతీస్తుందో చూడండి.. వైరల్ వీడియో

Cat Viral Video: నెట్టింట తరచూ ఇన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా.. మరికొన్ని క్యూట్‌గా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా జంతువులకు

Viral Video: అదృష్టం అంటే ఈ పిల్లిదే.. స్టైల్‌గా ఎలా కునుకుతీస్తుందో చూడండి.. వైరల్ వీడియో
Cat

Edited By: Anil kumar poka

Updated on: Feb 13, 2022 | 7:58 AM

Cat Viral Video: నెట్టింట తరచూ ఇన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా.. మరికొన్ని క్యూట్‌గా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన అందమైన, ఫన్నీ వీడియోలు ఇంటర్నెట్‌లో నిత్యం సందడి చేస్తుంటాయి. రోజుకో కొత్త వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ వీడియోలలో కుక్కలు, పిల్లులు, కోతుల అల్లరి వీడియోలు ఉంటాయి. తాజాగా.. పిల్లికి సంబంధించిన మరో క్యూట్ వీడియో నెట్టింట (social media) ట్రెండ్ అవుతోంది. పిల్లుల వీడియోలు చాలా అందంగా ఉంటాయి. అందుకే వీటిని చూసేందుకు నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు. తాజాగా వైరల్ అవుతున్న పిల్లి వీడియోను (Cat Viral Video) చూసి.. అదృష్టం అంటే ఈ పిల్లిదే అంటూ నవ్వుకుంటున్నారు.

వైరల్ అవుతున్న ఈ పిల్లి వీడియోను @buitengebieden_ అనే పేజీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ పేజీ తరచుగా జంతువుల ఫన్నీ మరియు అందమైన వీడియోలను షేర్ చేస్తుంది. ఈ వీడియోలో ఓ అందమైన పిల్లి టేబుల్‌పై పడుకుని హాయిగా నిద్రపోతుంది. నిద్రపోవడం కామన్ కానీ.. ఈ స్టైల్లో నిద్రపోవడం మాత్రం అమేజింగ్ అంటున్నారు నెటిజన్లు. టేబుల్‌పై ఉంచిన ల్యాప్‌టాప్‌పై పిల్లి తల పెట్టి.. ఓ స్టైల్లో కూల్‌గా నిద్రపోతుంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..

వైరల్ వీడియో..

అయితే.. వీడియో చూసిన ప్రతిఒక్కరూ.. చాలా క్యూట్‌గా ఉందంటూ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల మంది వీక్షించారు.

Also Read:

Viral Video: ప్రేమలో మునిగితేలుతున్న పిల్లి – కుక్క.. చూసి అవాక్కవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో..

Viral Video: రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు.. బానెట్‌పై పడినా కనికరం లేకుండా.. షాకింగ్ వీడియో