సోషల్ మీడియా ద్వారా ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు బయటకు వస్తున్నాయి. ప్రమాదాల సమయంలో జరిగిన అద్భుతాలను మనం అనేకం వీడియోలలో చూస్తుంటాం..అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక కారు డ్రైవర్ పెను పెద్ద ప్రమాదం నుండి అద్భుతంగా బయటపడటం కనిపించింది. ప్రమాదం చాలా తీవ్రంగా ఉంది. కారు వెనుక నుండి ట్రక్కును పూర్తిగా ఢీకొట్టింది. అయితే వారిని రక్షించేందుకు వచ్చిన వ్యక్తులు కారు డోర్ తెరిచి చూడగా ఓ అద్భుతం కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ ఘోర కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం ఎంత భయానకంగా ఉందంటే.. కారు మొత్తం ట్రక్కు కింద కూరుకుపోయింది. కారు పూర్తిగా దెబ్బతిన్నది. వెనుక నుంచి లారీని ఢీకొట్టిన కారు ఏకంగా లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జు నుజ్జుగా మారింది. ప్రమాదాన్ని చూస్తుంటే అందులో ప్రయాణించే వారు బతకడం కష్టమే కాదు అసాధ్యమని స్పష్టంగా చెప్పొచ్చు.
అయితే ప్రమాదం జరిగిన తర్వాత కొందరు వ్యక్తులు వచ్చి కారు డోర్‌ను బలవంతంగా తెరవడంతో డ్రైవర్ లోపలి నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఎయిర్‌బ్యాగ్, సీట్ బెల్ట్ వల్లే ఈ వ్యక్తి ప్రాణాలు రక్షించబడ్డాయని చెబుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.
bro got born for a second time pic.twitter.com/QCEf82g09F
— internet hall of fame (@InternetH0F) March 10, 2024
వైరల్ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఇంత ఘోర ప్రమాదం జరిగిన తర్వాత అతను బయటకు రాగానే మొదటి పని తన ఫోన్‌ని చెక్ చేయడమేనని ఒకరు రాశారు. అందుకే ఎప్పుడూ సీటు బెల్టు పెట్టుకోవాలని అంటారు అని ఒకరు రాశారు. ఏమీ పట్టనట్టు బయటికి వస్తున్నాడంటూ మరొకరు రాశారు. కారు దిగిన వెంటనే ఈ వ్యక్తి ఫోన్ వాడుతూ కనిపించాడని.. ఈ ప్రమాదానికి ఫోన్ వాడడమే కారణమా? బహుశా అతను ఫోన్‌లో చాట్ చేస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడని, అతనిపై కేసు నమోదు చేయాలని ఒకరు రాశారు. ఈ ప్రమాదం డ్రైవర్ అజాగ్రత్తను కూడా తెలియజేస్తోందని ఒకరు రాశారు.
@InternetH0F పేరు గల ఖాతాతో వీడియో షేర్ చేశారు. ఈ వీడియోను 7 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు. దీనిపై వేలాది మంది కామెంట్లు చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..