Telugu News Trending Car Bike Video was gone viral in social media Telugu Viral News
Video Viral: కారు డ్రైవర్ ను ఇబ్బంది పెడదామంటే.. చివరికి వారే ఇబ్బందులపాలయ్యారు.. షాకింగ్ వీడియో
కొన్నిసార్లు అనూహ్య సంఘటనలు జరుగుతాయి. అవి ఎప్పుడు ఎలా జరుగుతాయో అస్సలు ఊహించలేం. రద్దీగా ఉండే రోడ్లపై డ్రైవింగ్ (Traffic) చేయడం అంత సులభమైన విషయం కాదు. హోరన్ రోతలు, ట్రాఫిక్ ఇబ్బందుల...
కొన్నిసార్లు అనూహ్య సంఘటనలు జరుగుతాయి. అవి ఎప్పుడు ఎలా జరుగుతాయో అస్సలు ఊహించలేం. రద్దీగా ఉండే రోడ్లపై డ్రైవింగ్ (Traffic) చేయడం అంత సులభమైన విషయం కాదు. హోరన్ రోతలు, ట్రాఫిక్ ఇబ్బందుల మధ్య సురక్షితంగా ఇంటికి చేరడం కష్టసాధ్యమే. పార్కింగ్ కూ ప్లేస్ ఉండక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే ఘటనలు మనం ఎన్నో చూశాం. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ (Video) లో బైక్ నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు ఓ కారు డ్రైవర్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు. కానీ చివరికి వారే ఇబ్బందుల పాలవుతారు. వీడియోలో రోడ్డు పక్కన కొన్ని వాహనాలు పార్క్ అయి ఉంటాయి. కొన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఓ కారు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడికి బైక్ పై ఇద్దరు దుండగులు చేరుకుంటారు. వారిలో ఒకరు తుపాకీ తీసి కారు డ్రైవర్‌ను భయపెట్టేందుకు ప్రయత్నిస్తారు. అయితే అప్పటికి కారు డ్రైవర్ కు పరిస్థితి అర్థం అయింది. అతను తన కారును ఆపకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోతాడు. అదే సమయంలో దుండగులు పార్క్ చేసిన బైక్ కు కారు తగిలి అది కిందపడిపోతుంది. అంతే కాకుండా బైక్ ధ్వంసం అయిపోతుంది.
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 28 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాది మంది వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా ఈ సంఖ్య పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇస్తున్నారు. ‘అతను చాలా అదృష్టవంతుడని, తన ప్రాణాలు రక్షించుకోవడానికి కారు డ్రైవర్ సరైన పనే చేశాడని కామెంట్లు చేస్తున్నారు.