
పుచ్చకాయల లోడ్‌లో దాచిపెట్టిన రూ. 166 కోట్లు విలువ చేసే గంజాయిని పోలీసులు గుర్తించారు. పుచ్చకాయల మధ్య రవాణా చేస్తున్న ఈ 9.3 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు రిఫ్రిజిలేటర్ లారీని సీజ్ చేశారు. ఆ ట్రక్‌తో రెండు స్కౌట్ కార్లు ఎస్కార్ట్‌గా వెళ్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటన స్పెయిన్‌లోని మాలాగా శివార్లలో చోటు చేసుకుంది.
ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది
ఈ ఘటనలో భాగమైన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ రూ. 166 కోట్లు ఉంటుందని స్పెయిన్ సెంట్రల్ నార్కోటిక్స్ బ్రిగేడ్ పేర్కొంది. సెప్టెంబర్ 10న ఇది జరిగింది. పక్కా సమాచారంతోనే ఈ లారీని వారాల తరబడి ట్రాక్ చేసి.. అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాన్స్ అని పోలీసులు అన్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది చదవండి: నీటి అడుగున తేలియాడుతున్న వింత జీవి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్